అట్టహాసంగా గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2021-01-27T05:26:43+05:30 IST

అట్టహాసంగా గణతంత్ర వేడుకలు

అట్టహాసంగా గణతంత్ర వేడుకలు
పరేడ్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌ కృష్ణఆదిత్య

జిల్లా ప్రగతి సందేశాన్ని వివరించిన కలెక్టర్‌ కృష్ణఆదిత్య


ములుగు కలెక్టరేట్‌, జనవరి 26 : 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంగళవారం అట్టహాసంగా జరిగాయి. కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీస్‌ వందన స్వీకారించారు. కలెక్టర్‌ జిల్లా అభివృద్ధిలో సాధించిన ప్రగ తి సందేశాన్ని ప్రజలకు  వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా అధికారులు చర్యలు తీ సుకోవాలని సూచించారు. అనంతరం ఉత్తమ జిల్లా అధికారులు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా  ఉన్నతాధికారు లు, ఎమ్మెల్యే ధనసరి సీతక్క, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.  

ములుగుటౌన్‌ : జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఎస్పీ డాక్టర్‌ సంగ్రాం సింగ్‌ జి పాటిల్‌ జెండాను ఆవిష్కరించారు. జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్‌ కుమార్‌ శెట్టి అటవీశాఖ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా మహ్మద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ ఆవరణలో జెండా ను ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అల్లెం అప్పయ్య డీఎంహెచ్‌వో కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. జడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ జడ్పీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే ధనసరి సీతక్క జెండా ఎగురవేసి వందనం చేశారు. జిల్లాలో ఉత్తమ సేవలందించిన ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమాను సీతక్క సత్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, ఇతర నాయకులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు.  

 ఏటూరునాగారం రూరల్‌ : ఐటీడీఏ కార్యాలయంలో పీవో హనుమంతు కె. జెండగే జాతీయ జెండాను ఆవిష్కరించారు. గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమఫలాలను అందించే  లక్ష్యంతో ఐటీడీఏ కృషి చేస్తోందని అన్నారు. ఐటీడీఏ చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. 

 ఏటూరునాగారం :  మండలవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏఎస్పీ గౌస్‌ ఆలం, సర్పంచ్‌ ఈసం రామ్మూర్తి,  ఎంపీడీవో ఫణిచందర్‌, ఐసీడీఏస్‌ సీడీపీవో హేమలత, డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ రాములు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సురేష్‌ జెండాలను ఎగురవేశారు. 

గోవిందరావుపేట : మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 

 మేడారం : మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గణతంత్ర వేడుక లు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, యువజన సంఘా లు, రాజకీయపార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు.  

 కన్నాయిగూడెం:  ఎంపీడీవో బాబు, తహసీల్దార్‌ దేవాసింగ్‌ వారి కార్యాలయాల్లో జెండాలను ఆవిష్కరించారు.  

 తాడ్వాయి : మండలవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.  తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో సత్యాంజనేయప్రసాద్‌, పీఏసీఎ్‌సలో చైర్మన్‌ పులి సంపత్‌గౌడ్‌ జెండాలను ఆవిష్కరించారు.  

 వాజేడు : తహసీల్దార్‌ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం వాజే డు, పేరూరు పోలీ్‌సస్టేషన్‌లలో అధికారులు జెండాలను ఆవిష్కరించారు.    

 మంగపేట : మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు,  విద్యాసంస్థలలో త్రీవర్ణ పతాకాలను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు.






Updated Date - 2021-01-27T05:26:43+05:30 IST