వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు

ABN , First Publish Date - 2021-01-27T05:28:48+05:30 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.

వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు
గిద్దలూరు: పోలీసుస్టేషన్‌లో జెండా ఎగురవేస్తున్న ఎస్‌ఐ రవీంద్రరెడ్డి

గిద్దలూరు టౌన్‌, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు తదితర చోట్ల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.  గిద్దలూరులో పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ రవీంద్రరెడ్డి,  మున్సిపల్‌ కార్యాలయంలో ఏఈ కిరణ్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీసిల్దార్‌ రాజారమేష్‌ప్రేమ్‌కుమార్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రంగనాయకులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పట్టణంలోని ముస్లిం ఇమామ్‌ల సంఘం ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. కోటా పాఠశాలలో హెచ్‌ఎం మునిగౌరి జెండాను ఆవిష్కరించారు. 11వ వార్డు గాంధీబొమ్మ సెంటర్‌లో మహాత్మగాంధీ, డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ త్యాగాలను స్మరించుకుంటూ బీసీ సేవా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి వెంకటేశ్వర్లు నివాళులర్పించారు. అమ్మవారిశాలలో అధ్యక్షుడు శివపురం ఆంజనేయులు, మాజీసైనికుల ఉద్యోగుల సంఘం కార్యాలయం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.క్రిష్ణవేణి టాలెంట్‌ పాఠశాల నందు మాజీ సైనికుడు భూమా సైదయ్య జెండాను ఆవిష్కరించారు. 

పెద్దారవీడు: పెద్దారవీడులో మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో తహసీల్దార్‌ ఉమారాణి, ఎంపీడీవో జై రామ్‌ నాయక్‌, ఏపీఎం నాగ ముత్యాలు జాతీయ జెండాను ఎగురవేశారు. దేవరాజుగట్టు గ్రామంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ డి.రామకృష్ణ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.  నాదెళ్ల అగ్రికల్చర్‌ కళాశాల, లా కళాశాలలో కళాశాల చైర్మన్‌ నాదెళ్ల చంద్రమౌళి, గ్రంథాలయంలో వెంకటసుబ్బారెడ్డి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అలాగే, పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

పెద్ద దోర్నాల: మండలంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం జరుపుకున్నారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో తహసీల్దారు వేణుగోపాల్‌, ఎంపీడీవో కాశీంసాహెబ్‌, ఎస్సై హరిబాబు, అటవీ అధికారి కె.సునీల్‌కుమార్‌, అగ్నిమాపక అధికారి వెంకటరావు, వైద్యాధికారి భరద్వాజ్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం ఏవీహెచ్‌ ప్రసాద్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ మహబూబ్‌ భాషా, అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని అవిష్కరించారు.  

త్రిపురాంతకం: మండలంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. తహసీల్దార్‌ వి.కిరణ్‌, ఏవో కె.నీరజ, ఎంఈవో కేటీ.మల్లిఖార్జుననాయక్‌, డీఈఈ నరశింహారెడ్డి ఆయా కార్యాలయాల వద్ద జాతాయ పతాకాన్ని ఎగుర వేశారు. అలాగే, పలు కార్యాల యాలు, పాఠశాలల్లో త్రివర్ణ పతా కాన్ని ఎగురవేశారు. పలు పాఠశాలల్లో చిన్నారులు దేశ నాయకుల వేషధారణలతో అల రించారు.

కంభం: కంభం, అర్థవీడు మండలాల్లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  ఆయా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. 

రాచర్ల: మండలంలో మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్‌ జయపాల్‌, ఎంపీడీవో మస్తాన్‌వలి, ఏవో మహబూబ్‌ బాషా, ఎస్‌ఐ త్యాగరాజు ఆయా కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. రాచర్ల సచివాలయంలో ప్రత్యేక అధికారి సుబ్బారెడ్డి, స్పందన పాఠశాలలో పేర్ల సుధీర్‌కుమార్‌రెడ్డి, మాజీసైనికుల కార్యాలయంలో కెప్టెన్‌ అంకన్న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, సచివాలయాల్లో ఆతీయ జెండాను ఆవిష్కరించారు.  అంగన్‌వాడీ కేంద్రంలో తహసీల్దార్‌ జయపాల్‌ మొక్క లు నాటారు. 

పుల్లలచెరువు: మండలంలో గణతంత్ర దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్‌  చింతలపూడి అశోక్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి బాలుయ నాయక్‌, అలాగే ఆయా కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. చాపలమడుగు పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి నాగుల్‌మీరా, పంచాయతీ కార్యాదర్శి జె. అంజిరెడ్డి త్రివర్ణ పతాకాన్ని  ఎగుర వేశారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ప్రైవేటు అన్ని పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు.

Updated Date - 2021-01-27T05:28:48+05:30 IST