మువ్వన్నెల జెండా రెపరెపలు

ABN , First Publish Date - 2021-01-27T04:37:32+05:30 IST

ఎందరో సమర యోధులు, నాయకుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం వచ్చిందని అధికారులు, రాజకీయ నాయకులు అన్నారు.

మువ్వన్నెల జెండా రెపరెపలు
మార్టేరు వరి పరిశోధనాస్థానంలో గాంధీజీ విగ్రహం వద్ద నివాళి

ఘనంగా గణతంత్ర దినోత్సవం 

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రైవేట్‌ సంస్థల వద్ద జాతీయ పతాకావిష్కరణ


ఎందరో సమర యోధులు, నాయకుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం వచ్చిందని అధికారులు, రాజకీయ నాయకులు అన్నారు. పట్టణాలు, గ్రామాల్లో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద జాతీయ జెండా ఎగరవేశారు.


నరసాపురం టౌన్‌ / రూరల్‌ / మొగల్తూరు, జవనరి 26: పట్టణ, మండలంలో గణతంత్ర వేడుకలు మంగ ళవారం ఘనంగా జరిగాయి. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో తహసీల్దార్‌ ఆర్‌వీ.కృష్ణా రావు జాతీయ జెండా ఎగరవేశారు. వైఎన్‌ కళాశాలలో కోశాధికారి యర్రమిల్లి గోపాల కృష్ణమూర్తి జెండా ఎగరవేశారు. కరస్పాండెంట్‌ చినమిల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఆర్టీసీ డిపోలో డీఎం శివాజీ, రైల్వే స్టేషన్‌లో ఎస్‌ఎం మధు, వ్యవసాయాశాఖలో ఏడీఈ శ్రీనివాసరా వు, నీటిపారుదలశాఖ కార్యాలయంలో డీఈ సత్యనారాయణ, ఏటిగట్ల శాఖలో ఏఈ సుబ్బారావు, హౌసింగ్‌లో డీఈ పిచ్చయ్య, ఎక్సైజ్‌ కార్యాలయంలో సీఐ లక్ష్మితులసీ, మత్స్యశాఖ కార్యాల యంలో ఏడుకొండలు, అటవీశాఖలో రేంజ్‌ అధికారి పద్మజ, రుస్తుంబాదా లేసు ట్రేడింగ్‌ సెంటర్‌లో కలవకొలను తులసీ జెండాలు ఏగరవేశారు. జనసేన నేత బొమ్మిడి నాయకర్‌, కాంగ్రెస్‌ నేత కానూరి బుజ్జి, బీజేపీ నేత ప్రకాశ్‌ జాతీయ జెండా ఎగరవేశారు. మండలంలోని అన్ని సచివాలయ కార్యాల యాల్లో సిబ్బంది జెండాలను ఎగరవేశారు. మొగల్తూరు రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ ఎస్‌కె.హుసేన్‌, మండల పరిషత్‌ వద్ద ఎంపీడీవో ఆర్‌సి.ఆనంద్‌ కుమార్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ పతాకాలను ఎగురవేశారు.






భీమవరం / రూరల్‌ / ఎడ్యుకేషన్‌ / టౌన్‌ / వీరవాసరం : మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ కార్యదర్శి బి.ఫణికిశోర్‌ జెండా ఆవిష్కరించారు. చైర్మన్‌ తిరుమాని ఏడుకొండలు, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. గొల్లవానితిప్ప పీహెచ్‌సీలో వైద్యాధికారి సత్యనారాయణరాజు, ఎంపీహెచ్‌ఈవోలు, సీహెచ్‌వో, సూపర్‌వైజర్స్‌, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. డీఎన్నార్‌ కళాశాల అధ్యక్ష్య కార్యదర్శులు గోకరాజు నరసింహరాజు, గాదిరాజు బాబు, ప్రిన్సిపాల్‌ బీఎస్‌ శాంతకుమారి గణతంత్ర వేడుకలు నిర్వహించారు. సీఎస్‌ఎన్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఎస్‌.సత్యనారాయణ జాతీయ జెండా ఎగు రవేశారు. విష్ణు స్కూల్‌లో ప్రిన్సిపాల్‌ ఆర్‌.సత్యమూర్తి జెండా ఆవిష్కరించారు. డైరెక్టర్లు, క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సెక్రటరీ ఎస్‌వి.రంగరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రశాంతి ఓకేషనల్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఎన్‌ఎస్‌ఎం.నా యుడు, సంఘ సేవకుడు చెరుకువాడ రంగసాయి జాతీయ జెండా ఆవిష్కరించారు. భారతీయ విద్యా భవన్స్‌లో విద్యావేత్త దాయన సురేష్‌ చంద్రాజీ, భవన్స్‌ డైరెక్టర్‌ బీవీ.శేషగిరిరావు, ప్రిన్సిపాల్‌ ఎల్‌వి రమాదేవి పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగ స్పూర్తిని ప్రతీ ఒక్కరూ గౌరవించా లన్నారు. మునిసిపల్‌ కార్యాలయంలో మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.శ్యామల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ జ్యోతిలక్ష్మి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణ గుప్త జాతీయ జెండా ఎగురవేశారు. వీరవాసరం రెవెన్యూ కార్యాలయం వద్ద ఎం.సుందరరాజు, ఎంపీడీవో కార్యాలయం వద్ద పి.శామ్యూ ల్‌, పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ సీహెచ్‌ రామచంద్రరావు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్ర పటాలకు పూలమాలలు వేశారు. విధ్యా సంస్థల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.

Updated Date - 2021-01-27T04:37:32+05:30 IST