మైమరపించిన నృత్యాలు

ABN , First Publish Date - 2021-01-27T05:27:52+05:30 IST

నెల్లూరులోని శ్రీ వేంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో మంగళవారం రాత్రి గణతంత్ర దినోత్సవ సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

మైమరపించిన నృత్యాలు
యువతుల నృత్య ప్రదర్శన

 పలువురికి సత్కారాలు


నెల్లూరు(సాంస్కృతికం), జనవరి 26 : నెల్లూరులోని శ్రీ వేంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో మంగళవారం రాత్రి గణతంత్ర దినోత్సవ సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిద్దేంద్ర యోగి క్షేత్రం, ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల, గురుకృపా కళాక్షేత్రం చిన్నారులు దేశభక్తి గీతాలకు చేసిన నృతాలు ఆహూతులను అలరించాయి. నటరాజ కళా క్షేత్రం, శివసాయి కళానిలయం, అనంత హరహరనాట్య కళాక్షేత్రం, డీఏపీ హైస్కూలు నేలటూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ డ్యాన్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ రంగాల్లో రాణించిన వ్యక్తులను ఘనంగా సత్కరించారు. ఏవీ రమణయ్య(కూచిపూడి), పరాయితం నారాయణరావు(హరికథ), డాక్టరు టీఆర్‌ వసంతలక్ష్మి(సేవా రంగం)ని సత్కరించారు. అలాగే ఎస్‌ వేళాంగినీ రాజు(డ్యాన్స్‌), కోట రాజశేఖర్‌(అష్టావధానం), పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు(వేణుగానం), ఎం దక్షిణామూర్తి(డోలు), నెల్లూరు సుధాకర్‌రెడ్డి (మేకప్‌), జే బాలార్క(సంగీతం), తిరుపతి హరిగోపాల్‌(నాటకరంగం), న్యాయమూర్తి బీ కళాధర్‌(చిత్రలేఖనం)లను కూడా సత్కరించారు. నృత్య ప్రదర్శనలు చేసిన కళాకారులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు డాక్టరు ప్రభాకర్‌రెడ్డి, డాక్టరు హరేందిరాప్రసాద్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌, జడ్పీ సీఈవో సుశీల తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-27T05:27:52+05:30 IST