మువ్వన్నెల రెపరెపలు

ABN , First Publish Date - 2021-01-27T05:09:45+05:30 IST

జిల్లావ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ జెండాలను ఎగురవేశారు.

మువ్వన్నెల రెపరెపలు
చౌటుప్పల్‌లో జెండా ఎగురవేస్తున్న ఆర్డీవో సూరజ్‌ కుమార్‌

ఘనంగా 72వ గణతంత్ర వేడుకలు 

ఉద్యోగులకు అవార్డుల ప్రదానం 

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

జిల్లావ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను అవతనం చేశారు. ఈసందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. అడ్డగూడూరు తహసీల్దార్‌ కార్యాలయం, పోలీ్‌సస్టేషన్‌లో తహసీల్దార్‌ రామకృష్ణ, ఎస్‌ఐ మహేష్‌, ఆలేరు, మోటకొండూరు, రాజాపేటలో తహసీల్దార్లు, చౌటుప్పల్‌లో ఆర్డీవో ఎస్‌.సూరజ్‌కుమార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, రామన్నపేటలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఇబ్రహీం, సీఐ శ్రీనివాస్‌, గుండాలలో తహసీల్దార్‌ దయాకర్‌రెడ్డి, ఎంపీడీవో పుష్పలీల, భూదాన్‌పోచంపల్లిలో మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్నం సుదర్శన్‌, చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మి, తహసీల్దార్‌ దశరథ నాయక్‌, ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ డైరెక్టర్‌ డా ఎన్‌.కిషోర్‌రెడ్డి, మోత్కూరులో తహసీల్దార్‌ షేక్‌ అహమ్మద్‌, ఎంపీడీవో పి,మనోహర్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ షేక్‌ మహమూద్‌, ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌, ఆత్మకూరు(ఎం)లో తహసీల్దార్‌ పి.జ్యోతి, ఎంపీడీవో రాములు, వలిగొండలో తహసీల్దార్‌ నాగలక్ష్మి, ఎంపీడీవో గీతారెడ్డి, ఎంపీపీ లోతి రమే్‌షరాజు, వైస్‌ ఎంపీపీ బాతరాజు ఉమా బాలనర్సింహ, బీబీనగర్‌లో తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, తుర్కపల్లి, బొమ్మలరామారంలో తహసీల్దార్లు జ్యోతి, పద్మ సుందరి, ఎంపీడీవోలు ఉమాదేవి, సరిత, యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, గుట్టలో తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి, ఏసీపీ మనోహర్‌రెడ్డి, యాదగిరిగుట్ట దేవస్థాన ప్రధాన కార్యాలయంలో ఈవో గీతారెడ్డి, చైర్మన్‌ నరసింహమూర్తి వారి వారి కార్యాలయాల్లో జెండాలు ఎగురవేశారు. 

భువనగిరిలో..: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రం భువనగిరి త్రివర్ణ శోభితమైంది. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్‌లో ఇన్‌చార్జి డీసీపీ పి.యాదగిరి, జడ్పీలో సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో చైతన్యజైనీ, ఎస్సీ సంక్షేమ కార్యాలయంలో జిల్లా అధికారి సజన్‌, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి, మునిసిపాలిటీలో కమిషనర్‌ పూర్ణచందర్‌, జిల్లా గ్రంథాలయంలో సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్యాంసుందర్‌రెడ్డి, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో నాగిరెడ్డితో పాటు పలు జిల్లా కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో నర్ల నర్సింగ్‌ రావు, కాంగ్రెస్‌ కార్యాలయంలో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, సీపీఐ కార్యాలయంలో గోద శ్రీరాములు, సీపీఎం కార్యాలయంలో ఎండీ జహంగీర్‌, టీడీపీ కార్యాలయంలో కుందారపు కృష్ణాచారి జెండాలు ఎగురవేశారు.


ఉత్తమ గ్రామపంచాయతీలు

అడ్డగూడూరు మండలంలోని చిర్రగూడూరు ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైంది. అవార్డును సర్పంచ్‌ కమ్మంపాటి పరమేష్‌ అందుకున్నారు. అదే విధంగా రాజాపేట మండలం నర్సాపూర్‌ గ్రామం, ఆలేరు మండలం శారాజీపేట, మోటకొండూరు మండలం అమ్మనబోలు, బీబీనగర్‌ గ్రామపంచాయతీలు ఉత్తమ పంచాయతీ అవార్డులు సాధించాయి. ఆయా అవార్డులను సర్పంచ్‌లు నాగిర్తి గోపాల్‌రెడ్డి, సిరిపురం నర్మద, బండ పద్మ, మల్లగారి భాగ్యలక్ష్మి అందుకున్నారు.

Updated Date - 2021-01-27T05:09:45+05:30 IST