చైనా విద్యార్థులను దేశం నుంచి వెళ్లగొట్టనున్న అమెరికా..!

ABN , First Publish Date - 2020-05-29T22:40:47+05:30 IST

చైనా సైన్యంతో సంబంధాలున్న ఆ దేశపు పట్టభద్రులను అమెరికా నుంచి పంపించివేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని కొందరు...

చైనా విద్యార్థులను దేశం నుంచి వెళ్లగొట్టనున్న అమెరికా..!

వాషింగ్టన్: చైనా సైన్యంతో సంబంధాలున్న ఆ దేశపు పట్టభద్రులను అమెరికా నుంచి పంపించివేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని కొందరు చైనీయులు గూఢచారులుగా వ్యవహరిస్తున్నారని, అత్యంత ముఖ్యమైన సమచారాన్ని, వస్తువులను దొంగిలిస్తున్నారని, అందుకే వారిని తిరిగి పంపేందుకు సిద్ధమవవుతున్నామని అమెరికా ప్రభుత్వం తెలియజేసినట్లు సమాచారం. దీని ప్రభావం దాదాపు 3000 నుంచి 5000 మంది చైనా విద్యార్థులపై ఉండనున్నట్లు అంచనా. దీనిపై ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఇప్పటికే అమెరికాలో ఉన్న పట్టభద్రులైన చైనీయుల వీసాలు ముందుగా రద్దు చేస్తామని, ఆ తరువాత బయటనుంచి వచ్చే వారిని రాకుండా నియంత్రిస్తామని తెలిపారు.


అయితే ఈ నిర్ణయాన్ని కొన్ని విద్యా సంస్థలు వ్యతిరేకించే అవకాశం ఉందని చెప్పారు. ‘ప్రతి ఏడాది దాదాపు 3,60,000 మంది చైనా విద్యార్థుల ద్వారా ఏడాదికి 14 బిలియన్ డాలర్ల వరకు దేశానికి లాభం చేకూరుతోంది. ఈ స్థాయిలో లాభం వస్తున్నప్పుడు ఆయా విద్యా సంస్థలు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే అవకాశం ఉంది.

Updated Date - 2020-05-29T22:40:47+05:30 IST