‘ఉపాధి’ పనులపై నివేదిక అందజేయాలి

ABN , First Publish Date - 2020-09-20T06:42:39+05:30 IST

జిల్లాలో ఉపాధిహామి పథకంలో శాఖల వారిగా గుర్తించిన పనులు, చేపట్టిన పనుల పై ప్రగతి నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు...

‘ఉపాధి’  పనులపై నివేదిక అందజేయాలి

అధికారులకు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశం


కొత్తగూడెం కలెక్టరేట్‌, సెప్టెంబరు 19: జిల్లాలో ఉపాధిహామి పథకంలో శాఖల వారిగా గుర్తించిన పనులు, చేపట్టిన పనుల పై ప్రగతి నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశపు మందిరం నుంచి ఇరిగేషన్‌, ఉద్యానవనశాఖ, వ్యవసాయ, మ త్స్యశాఖ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో ఉ పాధిహామి పథకంపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌ మాసంలో జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నందున అభివృద్ది పనులను వేగవంతం చేయాలన్నారు. వెనుకబడిన జిల్లా, మా రుమూల గ్రామాలున్న జిల్లా అని పనులు గుర్తింపు విషయం లో అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొం టామని హెచ్చరించారు. ఉపాధిహామీ పథకంలో శాఖల వారీ గా చేపట్టిన పనులు, లక్ష్యంపై మండలాలు, గ్రామాల వారీగా జరుగుతున్న పనులపై నివేదికలు అందజేయాలని డీఆర్‌డీఏ పీడీ మధసూధన్‌రాజును ఆదేశించారు. కరోనా నేపధ్యంలో కష్టకాలంలో ప్రజలు ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారని వారికి జోవనోపాధిని పెంపొందించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పనులను పెద్ద ఎత్తున వినియోగించుకొనే అవకాశం కల్పించిందన్నారు. అధికారులు ఉపాధిహామి పనులను ప్రజలు వినియోగించుకొనే విధంగా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాల అభివృద్దితోపాటు ఇరిగేషన్‌, ఉద్యాన, వ్యవసాయ, పశుసంవర్ధక, చేపల పెంపకానికి చెరువులు ఏర్పాటు పనులను పెద్దఎత్తున చేపట్టాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు శాఖపరమైన విధులతోపాటు కేటాయిం చిన మండలాల్లో అభివృద్ది పనులు పర్యవేక్షణ చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి శుక్రవారం మండలాల్లో పర్యటించి ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలను తనిఖీ చేసి గుర్తించిన అంశాలపై నివేధికలు అందజేయాలన్నారు. 


Updated Date - 2020-09-20T06:42:39+05:30 IST