Abn logo
Sep 21 2020 @ 02:30AM

‘జీవో మేరకే ఫార్మాసిస్ట్‌ పోస్టుల భర్తీ’

కాకినాడ,సెప్టెంబరు20(ఆంధ్రజ్యోతి): ఇటీవలఫార్మాసిస్ట్‌ పోస్టులను ఏప్రిల్‌ 17, 2018న జీఏడీ జారీ చేసిన జీవో 63 అను సరించి భర్తీ చేశామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.సుబ్రహ్మణ్యేశ్వరి తెలిపారు. పోస్టుల భర్తీలో రోస్టర్‌ అమల్లో తప్పులు ఉన్నాయని ఫార్మాసిస్ట్‌ సంఘం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో రోస్టర్‌ అమలుపై వివరణ ఇచ్చారు. జీవోకు వ్యతిరేకంగా ఎటువంటి నియామకాలు జరగలేదన్నారు. అవకతవతలకు తావివ్వకుండా నూరుశాతం పారదర్శకతతో అర్హులైన అభ్యర్థులకు పోస్టింగ్‌లిచ్చామని చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement