రిపబ్లిక్‌ డే ఎఫెక్ట్‌.. రాష్ట్రవ్యాప్తంగా నిఘా తీవ్రతరం

ABN , First Publish Date - 2022-01-23T15:46:52+05:30 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రదాడి జరిగే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది. దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా,

రిపబ్లిక్‌ డే ఎఫెక్ట్‌.. రాష్ట్రవ్యాప్తంగా నిఘా తీవ్రతరం

పెరంబూర్‌(చెన్నై): గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రదాడి జరిగే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది. దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా, అవాంఛనీయ సంఘటలను అడ్డుకొనేలా ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అలాగే, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో పోలీసు జాగిలాలు, మెటల్‌ డిటెక్టర్‌లతో ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, మార్కెట్‌ ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఉంచారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా పోలీసులు గణతంత్ర దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-01-23T15:46:52+05:30 IST