మోటారు వాహనాల చట్టాన్ని రద్దు చేయండి

ABN , First Publish Date - 2022-05-20T05:13:17+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మోటారు వాహనాల చట్టాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, టీఆర్‌ఎ్‌సకేవీ జిల్లా అధ్యక్షుడు అరవింద్‌ డిమాండ్‌ చేశారు.

మోటారు వాహనాల చట్టాన్ని రద్దు చేయండి
సిద్దిపేటలో సీఐటీయూ, టీఆర్‌ఎస్‌కేవీ నాయకుల ర్యాలీ

 కార్మిక సంఘాల డిమాండ్‌, నిరసన


సిద్దిపేట అర్బన్‌, మే 19: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మోటారు వాహనాల చట్టాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, టీఆర్‌ఎ్‌సకేవీ జిల్లా అధ్యక్షుడు అరవింద్‌ డిమాండ్‌ చేశారు. గురువారం సిద్దిపేటలో ఆయా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి, ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టంతో మోటారు వాహనా యజమానులు, కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి రవికుమార్‌, టీఆర్‌ఎ్‌సకేవీ పట్టణాధ్యక్షుడు బాయికాడి శ్రీనివాస్‌, ఆటో ట్రాన్స్‌ఫోర్టు యూనియన్‌ జిల్లా కార్యదర్శి మండల భాస్కర్‌, టీఆర్‌ఎ్‌సకేవీ ఆటో యూనియన్‌ పట్టణాధ్యక్షుడు కిట్టు, సూరం భాస్కర్‌, ఉమర్‌, తిరుపతి, ఎండి కరీం, కిషన్‌, ఆంజనేయులు, సాదిక్‌, రాఘవులు, సీఐటీయూ నాయకులు ఎండి పాషా, సురేందర్‌, ప్రవీన్‌కుమార్‌, హరీ్‌షకుమార్‌, లింగారెడ్డి, రామచంద్రం పాల్గొన్నారు.


ప్రజ్ఞాపూర్‌, హుస్నాబాద్‌లో


గజ్వేల్‌, మే 19: ప్రజ్ఞాపూర్‌, గజ్వేల్‌ ఆటో యూనియన్‌ నాయకులు ప్రజ్ఞాపూర్‌లో సమ్మె నిర్వహించారు. నూతన రవాణా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో పూదరి లింగం, ఖాసీం, అక్భర్‌ పాల్గొన్నారు.

హుస్నాబాద్‌: పట్టణంలో కరీంనగర్‌ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆటోలను బంద్‌ చేసి ధర్నా నిర్వహించారు. అంతుకుముందు ముందు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఆటో కార్మిక సంక్షేమ సంఘం నాయకులు సత్తిరెడ్డి, లక్ష్మన్‌, సంపత్‌, రాజు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-05-20T05:13:17+05:30 IST