ఆక్సిజన్‌ కొరత నివారించాలి

ABN , First Publish Date - 2021-05-16T05:56:34+05:30 IST

తీరప్రాంతంలో రోజురోజుకు కరోనా ఉధృతి పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అన్నారు.

ఆక్సిజన్‌ కొరత నివారించాలి

ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌


రేపల్లె, మే 15: తీరప్రాంతంలో రోజురోజుకు కరోనా ఉధృతి పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను తప్పనిసరిగా పాటించాలని అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు. వైద్యశాలలో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ఆర్భాటంగా అన్ని వైద్యశాలలో ఆక్సిజన్‌ పూర్తి స్థాయిలో ఏర్పాటుచేస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఆచరణలో సాధ్యం కావటం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాలలో జ్వరాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కనీసం వారికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయటం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవటంతో రోగం ముదరబెట్టేదాకా ఉండటంతో ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. రేపల్లెలో ఇంకో క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి రోగులకు ఇక్కడే వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

Updated Date - 2021-05-16T05:56:34+05:30 IST