కడెంకు మరమ్మతులు

ABN , First Publish Date - 2022-08-04T06:47:05+05:30 IST

గత కొద్దిరోజుల కితం కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు గేట్లకు యు ద్ధ ప్రతిపాదికన మరమ్మతులు కొనసాగుతున్నాయి.

కడెంకు మరమ్మతులు
ప్రాజెక్టుగేట్లకు మరమత్తులు చేపడుతున్న దృశ్యం

ముమ్మరంగా సాగుతున్న గేట్ల మరమ్మతులు 

రంగంలోకి 15 మందితో కూడిన టెక్నికల్‌ బృందం 

గత వారం రోజుల నుంచి రాత్రింబవళ్లు కొనసాగుతున్న పనులు 

ఆగస్టు చివరి వారంలో కాలువలకు నీటిని విడుదల చేసే అవకాశం 

40 టీయంసీలకు పైగా వృథా అయిన ప్రాజెక్టు నీరు

నిర్మల్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : గత కొద్దిరోజుల కితం కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు గేట్లకు యు ద్ధ ప్రతిపాదికన మరమ్మతులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన స్పెషల్‌ టెక్నికల్‌ టీం రాత్రింబవళ్లు ప్రాజెక్టు వద్దే తిష్ఠ వేసి గేట్లకు, కౌంటర్‌వేటర్‌ల మరమ్మతులను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 18 గేట్లు వరద ప్రవాహానికి దెబ్బతిన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం నష్టం అంచనా రూ.7 కోట్లకు పైనే ఉంది. అయితే ప్రాజెక్టు గేట్లు కిందికి దిగకపోవడంతో వరదసమయంలో ము ప్పు వెంటాడింది. ఓదశలో వరదప్రవాహం ఉధృతికారణంగా ప్రాజెక్టు కొట్టుకుపోవచ్చని సంకేతాలు సైతం వెలువడ్డాయి. దీంతో అధికారులు వరద ప్రవాహం ధాటి నుంచి ప్రాజెక్టును రక్షించే విషయంలో చేతులేత్తేశారు. మొత్తంగేట్లు కిందికి దిగని కారణంగా ఇప్పటి వరకు 40 టీఎ ంసీలకు పైగా వరద నీరు గోదావరి పాలైంది. అయితే హైదరాబాద్‌కు చెందిన 15మందితో కూడిన టెక్నికల్‌ బృందం ఆపరేషన్‌ అండ్‌ మెయిన్‌టెనెన్స్‌ నిధులతో మరమ్మతులు కొనసాగిస్తోంది. ప్రాజెక్టు రెండోగేటు, మూడోగేటుకు సంబంధించి కౌంటర్‌వేటర్‌లు వరద ఉధృతికి పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే వరదనీటిలో మునిగి 9 జర్మనీగేట్లకు నష్టం వా టిల్లింది. ఏడు ఇండియన్‌గేట్లు కూడా చెడిపోయాయి. ప్రస్తుతం జర్మనీ, ఇండియన్‌గేట్లకు మరమ్మతులు కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుతో పాటు కుడి, ఎడమ కాలువలు దెబ్బతినడంతో వాటికి కూడా మరమ్మతులు జరిపి చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఈ రెండోకాలువ కింద 68 వేల ఎకరాల పంట భూములు సాగవుతున్నాయి. ప్రతీయేటా ఆగస్టు మొదటివారంలో వానకాలం పంటల కోసం సాగునీరును ఈ కాలువల ద్వారా విడుదల చేస్తారు. ఎడమకాలువ కింద 58వేల ఎకరాలు, కుడి కాలువ కింద 2 వేల ఎకరాల పంటలు సాగవుతుంటాయి. అయితే ఈ సారి గేట్ల మురమ్మతుల పనులు కొనసాగుతున్న కారణంగా అలాగే రిజర్వాయర్‌లో నీటిని నిరంతరం దిగువకు విడుదల చేస్తున్న కారణం గా ఆగస్టు మొదటివారంలో నీరు విడుదల చేయలేకపోయారు. పనులన్నీ పూర్తయితే ఆగస్టు చివరివారంలో పంటభూములకు నీరు అంది ంచే అవకాశం ఉంది. 

రంగంలోకి ప్రత్యేక సాంకేతిక బృందం

కడెం ప్రాజెక్టుగేట్ల మరమ్మతులను యుద్ధ ప్రాతిపాదికన చేపట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. దాదాపు రూ.7కోట్ల మేరకు నష్టం జరిగినప్పటికీ.. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ నిధులతో మరమ్మతు పనులు చేపడుతున్నారు. కలెక్టర్‌ ముషారప్‌ ఆలీ ఫారూఖీ, ఇరిగేషస్‌ ఎస్‌ఈ సుశీల్‌ కుమార్‌, డీఈ రాజశేఖర్‌ల పర్యవేక్షణలో ఈ స్పెషల్‌ టీం రాత్రింబవళ్లు గేట్ల మరమ్మతులతో పాటు కౌంటర్‌వేటర్‌లకు రిపేర్లు నిర్వహిస్తున్నారు. అయితే నిర్ణీత గడువులోగా మరమ్మతు పనులు పూర్తి చేయాలన్న ఆదేశాలతో ఈ టెక్నికల్‌ టీం తమకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శిం చి పనులను యుద్ధప్రాతిపాదికన పూర్తి చేయడంలో నిమగ్నమైంది. 

వానాకాలం పంటకు నీటి విడుదలపై గందరగోళం

ప్రతియేటా ఆగస్టు మొదటివారంలో వానాకాలం పంటలకోసం కడెం ప్రాజెక్టు ద్వారా అధికారులు సాగునీటిని అందిస్తుంటారు. మొత్త ం 68 వేల ఎకరాలు లక్ష్యంగా.. ఈ ప్రాజెక్టు నీటిని కుడి, ఎడమల కాలువల ద్వారా సాగునీటిని అందిస్తున్నారు. అయితే ఈసారి వరదల కారణంగా కడెం ప్రాజెక్టు గేట్లు పూర్తిగా దెబ్బతిన్నందు వల్ల రిజర్వాయర్‌ నీరంతా గోదావరి పాలవుతోంది. మొత్తం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 7.6 టీయంసీలు కాగా.. రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీరు ఎగువ నుంచి వస్తున్నందంతా దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నీరు రిజర్వాయర్‌లో నిల్వ ఉంచడం సాధ్యం కావడం లేదు. నిర్ధేశిత గడువులోగా గేట్ల మరమ్మతులు పూర్తయితే ఎగువ నుం చి వరదను రిజర్వాయర్‌లో నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఆగస్టు చివరివారం వరకైనా కుడి, ఎడమ కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించవచ్చని ఇరిగేషన్‌ అధికారులు భావిస్తున్నారు. 

సమస్యగా కౌంటర్‌వేటర్‌ల మరమ్మతులు 

కడెం ప్రాజెక్టుగేట్ల మరమ్మతుల్లో కౌంటర్‌వేటర్‌ల రిపేర్లు వ్యవహారం టెక్నికల్‌ టీంకు సవాలుగా మారింది. ప్రస్తుతం రెండో, మూడవ గేటుకు సం బంధించిన కౌంటర్‌ వేటర్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్కో కౌంటర్‌ వేటర్‌ బరు వు 47 టన్నులకు పైగా ఉంటుంది. గేట్ల తో పాటు వీటి మర మ్మతుల వ్యవహారం టెక్నికల్‌ బృందానికి ఇబ్బందులు సృష్టిస్తోంది. నిర్ధేశిత గడువులోగా ఇటు గేట్లు.. అటు కౌంటర్‌వేటర్‌ల మరమ్మతులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని టెక్నికల్‌ టీం పనులు కొనసాగిస్తోంది. మొత్తానికి ప్రాజెక్టుగేట్ల మరమ్మతులు పూర్తయితేనే ఖరీఫ్‌ కోసం ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. 

25 తేదీలోగా మరమ్మతు పనులు పూర్తి

సుశీల్‌ కుమార్‌, ఎస్‌ఈ 

ఈ నెల 25వ తేదీలోగా కడెం ప్రాజెక్టు మరమ్మతులు పనులను పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ ఎస్‌ఈ సుశీల్‌ కుమార్‌ అన్నారు. దీని కోసం సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని తెలిపారు. అందువల్ల సకాలంలో పనులు పూర్తి చే స్తామని సుశీల్‌ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-08-04T06:47:05+05:30 IST