Abn logo
Jul 25 2021 @ 00:17AM

సంపంగిగెడ్డపై వంతెనకు మరమ్మతులు చేపట్టాలి

గెడ్డలో దిగి నిరసన తెలుపుతున్న కిడారి శ్రావణ్‌కుమార్‌, టీడీపీ నేతలు

మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌ పాడేరు, జూలై 24: డుంబ్రిగుడ మండలం కించుమండ సమీపంలోని సంపంగిగెడ్డపై వంతెనకు మరమ్మతులు చేపట్టాలని మాజీమంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ వంతెన మరమ్మతులపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిని వ్యతిరేకిస్తూ శనివారం సంపంగిగెడ్డలో దిగి టీడీపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. వంతెనకు మరమ్మతుల కారణంగా డుంబ్రిగుడ, అరకులోయ, హుకుంపేట మండలాల గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యను గుర్తించిన టీడీపీ ప్రభుత్వం గతంలో వంతెన మరమ్మతులకు రూ.4 కోట్లు మంజూరు చేసినప్పటికీ, నేటికీ వైసీపీ ప్రభుత్వం పనులు చేపట్టలేదన్నారు. దీంతో సంపంగిగెడ్డ అవతల ఉన్న మూడు మండలాలకు చెందిన అనేక గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ నేతలు తుడుము సుబ్బారావు, కొర్రా దన్నేరావు, సాగర సుబ్బారావు, వంతాల నాగేశ్వరరావు, బాకూరు వెంకటరమణ, టి.సత్యనారాయణ, కె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.