Abn logo
Sep 20 2021 @ 23:53PM

రహదారులను మరమ్మతు చేయరా?

చందలూరు సమీపంలో గుంతలమయమైన రహదారి

  1. రాకపోకల్లో ప్రాణ సంకటం 


రుద్రవరం, సెప్టెంబరు 20: మండలంలోని మందలూరు, చందలూరు గ్రామాల మధ్య రహదారులు గుంతలమయం కావడంతో రాకపోకలు ప్రాణ సంకటంగా మారాయి. సుమారు 15 ఏళ్ల క్రితం రహదారి నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదని రెండు గ్రామాల ప్రజలు అంటున్నారు. వాహనదారులు నానా యాతన పడుతున్నారు. వర్షం కురిస్తే నీరు నిలిచిపోయి ఎక్కడ గుంత ఉన్నదీ, ఎంతు లోతు ఉన్నదీ తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయి. 


15 ఏళ్ల కిందటి రహదారి 

మందలూరు-చందలూరు గ్రామాల మీదుగా 15 ఏళ్ల క్రితం రహదారి  నిర్మించారు.  ఇంతవరకు మరమ్మతులు చేయలేదు. రహదారి పొడవునా గుంతలు ఏర్పడ్డాయి. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. 

- రాజశేఖర్‌రెడ్డి, మందలూరు 


ఎన్నాళ్లు ఇలా ?

గుంతల రహదారిపై ఎన్నాళ్లు ఇలా ప్రయాణం చేయాలి? అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. రాకపోకలకు నానా యాతన పడుతున్నాం. ప్రజా ప్రతినిధులు అసలే పట్టించుకోవడం లేదు. 

- నాగిరెడ్డి, మందలూరు