Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మువ్వన్నెలు మురవంగా..

twitter-iconwatsapp-iconfb-icon
మువ్వన్నెలు మురవంగా.. జెండా వందనం చేస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

కందుకూరు, జనవరి 26: 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను బుధవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. పట్టణంతో పాటు గ్రామగ్రామాన జాతీయ పతాకాలను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని ఆ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు తెలియజెప్పాల్సిన ఆవశ్యకతను వక్తలు వివరించారు. కందుకూరు మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేశారు. ఈ సందర్భంగా పాత తాలూకా కార్యాల యాల ఆవరణలో ఉన్న మహాత్ముని విగ్రహానికి ఎమ్మెల్యే మహీధరరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలోను ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని పెద్దబజారులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మాగాంధీ నూతన విగ్రహాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య పెద్దలతో పాటు తహసీల్దార్‌ డి. సీతారామయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌. మనోహర్‌ తదితరులు పాల్గొనగా మహాత్ముని గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలు కూడా గుర్తుంచుకునేలా ఆర్యవైశ్య పెద్దలు గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేయటం అభినందనీయమన్నారు. పట్టణంలోని కోర్టు భవనాల సముదాయంలో సబ్‌ జడ్జి కె. విజయ్‌బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొని ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. స్థానిక ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజిలో కరస్పాండెంట్‌ కంచర ్ల రామయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

కనిగిరి : ప్రతి భారతీయుడు భారతజాతి అభ్యున్నతి కోసం పునరంకితం కావాలని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ పేర్కొన్నాడు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం కనిగిరిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగురవేశాడు.  తొలుత పట్టణంలోని తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎమ్మెల్యే ఎగురవేశారు. అనంతరం ఒంగోలు బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రకాశం, జడ్పీటీసీ కస్తూరిరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, ఏఎంసీ చైర్మన్‌ వైఎం సరిత, వాసవి సత్రసముదాయాల చైర్మన్‌ దేవకి వెంకటేశ్వర్లు, మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు డాక్టర్‌ పెరుగు మురళీకృష్ణ యాదవ్‌, తహశీల్దార్‌ పుల్లారావు, ఎంపీడీవో మల్లికార్జునరావు, ఏఫ్‌ఏసీ కమీషనర్‌ లావణ్య, వివిధశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

పామూరులో : మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో ఎం రంగసుబ్బారాయుడు, సింగిల్‌విండో కార్యాలయంలో సీఈవో శేషిరెడ్డితో కలిసి ఎంపీపీ గంగసాని లక్ష్మీ జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ సీహెచ్‌ఉష, డాక్టర్‌ పి రాజశేఖర్‌, సీఐ కె శ్రీనివాసరావు, ఎస్‌ఐ సురేష్‌, ఈవోపీఆర్డీ బ్రహ్మనందరెడ్డి, జడ్పీటీసీ సీహెచ్‌ సుబ్బయ్య, పువ్వాడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

వెలిగండ్లలో : పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. వెలిగండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం చింతా విజయ్‌భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎఫ్‌ఏ-2 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ బహుమతులు అందజేశాడు. ఆర్దికంగా వెనుకబడిన 6 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 5వేలు చొప్పున సాయం చేశారు. 

దొనకొండ : దొనకొండ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దార్‌ పి సురే్‌షబాబు, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీడీవో ఎస్‌ఎండీ దావూద్‌, పోలీ్‌సస్టేషన్‌ వద్ద కొత్తపల్లి అంకమ్మ, కస్తూరీభా గాంధీ బాలికల గురుకుల పాఠశాల వద్ద ఎంపీపీ బొరిగొర్ల ఉషారాణి, ఆరోగ్యకేంద్రం వద్ద ఏఎన్‌ఎంలు, అన్నీ పాఠశాలల వద్ద ప్రధానోపాద్యాయులు, గ్రామ సచివాలయాల వద్ద కార్యదర్శులు, జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీపీ బొరిగొర్ల ఉషారాణి, ఎంఈవో సాంబశివరావులు గణతంత్రదినోత్సవ వేడుకల ప్రత్యేకతను క్లుప్తంగా వివరించారు.  కార్యక్రమాల్లో జడ్పీటీసీ ఎం సుధాకర్‌, వైస్‌ ఎంపీపీ మిట్టా కోటిరెడ్డి, ఎంపీటీసీ గుంటు అమ్మాజీ అజయ్‌, వైసిపీ నాయకులు బీఎస్‌ రాజు, జొన్నకూటి సుబ్బారెడ్డి, పాతకొట కోటిరెడ్డి, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

దర్శి  :  తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో దర్శి తహసీల్దార్‌ వీడీబీ వరకుమార్‌, కోర్టు ఆవరణలో జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ వాణి, పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం ఆవరణలో సీఐ భీమానాయక్‌, తదితరులు జాతీయ జెండాలను ఎగురవేశారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, విద్యాసంస్ధల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 

ఫ కురిచేడు : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో జడ్పీటీసీ సభ్యుడు నుసుం వెంకటనాగిరెడ్డి, కేజీబీవీ పాఠశాలలో ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మలు జండావందనం చేశారు. పాఠశాలల్లో విద్యార్ధులకు పలు రకాల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమాలలో తహసీల్దార్‌ రాధాక్రిష్ణ, ఎస్‌ఐ పులి శివనాగరాజు, ఎంపీటీసీలు కానాల శివారెడ్డి, బుల్లం వెంకట నరసయ్య, బెల్లం చంద్రశేఖరరావు, నుసుం నాగిరెడ్డి పాల్గొన్నారు. 

లింగసముద్రం :  తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ బ్రహ్మయ్య, ఎంపీడీవో కె శ్రీనివాసరెడ్డి, పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌ రమేష్‌ పీహెచ్‌సీలో సీహెచ్‌ఓ జి శ్రీనివాసులు జాతీయ జెండాలను ఎగుర వేశారు. లింగసముద్రం, వీఆర్‌ కోట, మొగిలిచెర్ల, పెదపవని  జడ్పీహైస్కూళ్లో, ప్రధానోపాధ్యాయులు పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగుర వేశారు.

వలేటివారిపాలెం : మండలపరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీఓ రపీక్‌అహ్మద్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ జనార్దన్‌, పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌ఐ సుదర్శన్‌, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఇన్‌చార్జీ ఏఈ మదుబాబు, ఎఆర్‌సిలో ఇన్‌చార్జీ ఎంఈఓ రవిచంద్ర. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాదికారి శ్రీనివాసరావు తదితరులు జెండా ఆవిష్కరించారు.

 పీసీపల్లి : మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు మండల పరిషత్‌ కార్యాలయం, తహశీల్దార్‌ కార్యాలయం, పోలీసుస్టేషన్‌, ప్రభుత్వ వైద్యశాల, స్ర్తీశక్తి భవనం, సచివాలయ ప్రాంగణాల్లో మూడురంగుల జాతీయ జెండాను ఎగురవేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్ధులకు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను వివరించారు.

సీఎ్‌స.పురం : సీ.ఎ్‌స.పురం సచివాలయంలో సర్పంచ్‌ శ్రీరాం పద్మావతి, ఉప సర్పంచ్‌ పాములపాటి నర్సయ్య, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కట్టా శ్రీనువాసులు, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ బి.వి.రమణారావు, రైతు భరోసా కేంద్రంలో ఏవో కె.రాధా, పోలీ్‌సస్టేషన్‌లో ఎస్సై చుక్కా శివ బసవరాజులు జాతీయ జెండాలను ఎగురవేసి జెండా వందనం నిర్వహించారు. అలాగే పంచాయితీ కార్యాలయాలలో ఆయా పంచాయితీల సర్పంచ్‌లు జాతీయ జెండాలను ఎగురవేశారు. స్థానిక కెజిబివి పాఠశాలలో డివైఎ్‌ఫఐ, ఎస్‌ఎ్‌ఫఐ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

ముండ్లమూరు : మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీడీవో బీ చంద్రశేఖరరావు, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం, పోలీసు స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ జీ వెంకట సైదులు, సబ్‌ స్టేషన్‌ వద్ద ట్రాన్స్‌కో ఏఈ భూరాజు, ఏపీ మోడల్‌ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌ పూర్ణచంద్రరరావు, కేజీబీవీ పాఠశాలలో ప్రత్యేక అధికారి ఆవుల సునీత, ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం సుజాత జాతీయ జెండాలను ఎగుర వేసి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద అధికారులతో పాటు ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మండలంలోని వేంపాడు ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థి తాళ్ళూరి నిశాంత్‌, సుభాష్‌ చంద్రబోసు వేషధారణ ఆకట్టుకుంది. 

కనిగిరి : 73వ గణతంత్ర వేడుకలు కనిగిరి పట్టణంలో వివిధ వర్గాలు, పాఠశాలల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రగతి విద్యానిలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దాదాపు 150 మీటర్ల పతాకాన్ని విద్యార్థులు వీధులవెంట ఆవిష్కరింపజేస్తూ పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు దేశ నాయకుల వేషదారణలు, భరతమాత వేషదారణతో నిర్వహించిన ర్యాలీ ఎంతో ఆకర్షణగా నిలిచింది. గణతంత్రదినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ ఆటలపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్‌ కె ప్రభాకరరావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల  ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

జమాతే ఉలేమా హింద్‌ ఆద్వర్యంలో

73వ గణతంత్ర వేడుకలు జమాతే ఉలేమా హింద్‌ వారి ఆధఽ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఒంగోలు బస్టాండ్‌ సెంటర్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ వందనం చేశారు. ముస్లింలు ధరించిన వస్ర్తాలకు ప్లాగ్‌ను ధరించడంతో పాటు జాతీయ జెండాలు చేతబూని జైహింద్‌ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో జమాతే ఉలేమా హింద్‌ ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ కలాం, మాజీ అంజుమన్‌ కమిటీ అధ్యక్షులు రోషన్‌ సందాని, మౌలానా ఖాశీం, ముస్తీప్‌ సద్దాం, మౌలానా గులాంరసూల్‌, ముఖ్య అతిధిగా డిప్యూటీ తహశీల్దార్‌ కిషోర్‌, మదరసా ముస్లిం విద్యార్థులు పాల్గొన్నారు.  

టీడీపీ ఆధ్వర్యంలో : గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు చిరంజీవి బుధవారం జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ వందనం చేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, టౌన్‌ తెలుగు యువత అధ్యక్షులు ఫిరోజ్‌, సీనియర్‌ టీడీపీ నాయకులు దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, గాయం తిరుపతిరెడ్డి, శాంతి శ్రీను, చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు. 

ఉలవపాడు : తహసీల్దార్‌ కార్యాయంలో తహసీల్దార్‌ కే.సంజీవరావు, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో ఎల్‌.చెంచమ్మ, ఎస్సై త్యాగరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌవరవ వందనం చేశారు. అదేవిధంగా సచివాలయాల్లో, బ్యాంక్‌లు, ఇతర ప్రభుత్వ కార్యాలయంపై త్రివర్ణ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉలవపాడులోని శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు పుస్తక ప్రదర్శన, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి 20 మంది విద్యార్ధులకు బహుమతులు అందచేసినట్లు గ్రంఽథపాలకుడు దాసరి కోటేశ్వరరావు తెలిపారు.  అదేవిధంగా కరేడు పీహెచ్‌సీలో వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్‌ కే శ్రీనివాసులకు ఉత్తమ వైద్యసేవకుడిగా ప్రసంశాపత్రం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ చేతుల మీదగా అందుకున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.