పరిమితంగా రుణాల పునర్‌ వ్యవస్థీకరణ!

ABN , First Publish Date - 2020-06-30T05:49:58+05:30 IST

కోవిడ్‌ దెబ్బతో అల్లాడిపోతున్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేందుకు ఆర్‌బీఐ మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. కంపెనీల రుణాలను ఒకసారికి పునర్‌ వ్యవస్థీకరించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం...

పరిమితంగా రుణాల పునర్‌ వ్యవస్థీకరణ!

  • ఆగస్టు ఆఖర్లో ప్రకటన !


న్యూఢిల్లీ: కోవిడ్‌ దెబ్బతో అల్లాడిపోతున్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేందుకు ఆర్‌బీఐ మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. కంపెనీల రుణాలను ఒకసారికి పునర్‌ వ్యవస్థీకరించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. అయితే ఈ వెసులుబాటు అన్ని రంగాలకు గాకుండా, కోవిడ్‌తో తీవ్రంగా నష్టపోయిన  ఆతిథ్యం, పర్యాటకం, నిర్మాణరంగం, విమానయానం వంటి కొన్ని రంగాల్లోని కంపెనీలకే పరిమితం పరిమితం చేయాలని ఆర్‌బీఐ భావిస్తోంది.


కోవిడ్‌ నేపథ్యంలో ఒక సారికి  రుణ  పునర్‌ వ్యవస్థీకరణకు అనుమతించాలని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీ ఏ), పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు ఇప్పటికే విజ్ఞప్తి చేశా యి. దీంతో ఏ ఏ రంగాలు కోవిడ్‌తో తీవ్రంగా దెబ్బతిన్నాయనే విషయాన్ని ఆర్‌బీఐ మదింపు చేస్తోంది. రుణాలపై ఆర్‌బీఐ  ఆగస్టు వరకు మారిటోరియం అమలులో ఉన్న నేపథ్యంలో ఆ నెల చివరిలో లేదా సెప్టెంబరులో పునర్‌వ్యవస్థీకరణ నిబంధనలు ప్రకటిస్తుందని భావిస్తున్నారు. 


Updated Date - 2020-06-30T05:49:58+05:30 IST