31 నుంచి బడులు తెరిపించండి: ట్రస్మా

ABN , First Publish Date - 2022-01-22T17:41:28+05:30 IST

ప్రైవేట్‌ విద్యాసంస్థలను ఈనెల 31 నుంచి తెరిపించాలని తెలంగాణ రికగ్నైజ్డ్డ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఎస్‌సీఈఆర్‌టీ భవనంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని శుక్రవారం కలిసి

31 నుంచి బడులు తెరిపించండి: ట్రస్మా

హైదరాబాద్‌ సిటీ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ విద్యాసంస్థలను ఈనెల 31 నుంచి తెరిపించాలని తెలంగాణ రికగ్నైజ్డ్డ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఎస్‌సీఈఆర్‌టీ భవనంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని శుక్రవారం కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 220 పని దినాలకు ఇప్పటివరకు 85 రోజులు మాత్రమే తరగతి గది బోధనలు జరిగినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ విద్యా సంవత్సరాన్ని పొడిగించాలని కోరారు. ట్రస్మా విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. 

Updated Date - 2022-01-22T17:41:28+05:30 IST