మళ్లీ అదే కథ!

ABN , First Publish Date - 2021-06-23T06:56:16+05:30 IST

బోట్స్‌మెన్‌ సొసైటీ ఇసుక కథ మొదటికొచ్చింది. పడవల ద్వారా తీసే ఇసుక ధర పెంచవద్దని కోరితే..

మళ్లీ అదే కథ!
కాతేరు ర్యాంపులో ఇసుక నిల్వలు

ఇసుక అధిక రేటుకు చిత్రమైన పరిష్కారం
 టన్నుకు వసూలు రూ.675.. బిల్లు ఇచ్చేది రూ.475
నిలదీస్తున్న వినియోగదారులు 8 కలెక్టర్‌ జోక్యం?
 వివాదంతో మళ్లీ మూతపడిన సొసైటీ ర్యాంపులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
బోట్స్‌మెన్‌ సొసైటీ ఇసుక కథ మొదటికొచ్చింది. పడవల ద్వారా తీసే ఇసుక ధర పెంచవద్దని కోరితే.. సదరు కంపెనీ ఓ చిత్రమైన పరిష్కారం చూపించింది. వారం రోజులుగా మూసేసిన బోట్స్‌మెన్‌ ఇసుక ర్యాంపులను మంగళవారం ఉదయమే తెరిచారు. కానీ ఇసుక రేటు తగ్గించలేదు. టన్ను రూ.675కు అమ్మి రూ.475కు బిల్లు ఇచ్చారు. అంటే 10 టన్నుల ఇసుక రూ.6,750కు విక్రయించి రూ.4,775 బిల్లు ఇచ్చారు. పలు ర్యాంపుల్లో వినియోగదారులు దీన్ని నిలదీశా రు. అంతేకాక కలెక్టర్‌కు కొందరు ఫిర్యాదు చేయడంతో ఆయన జోక్యం చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి ఉభయగోదావరి జిల్లాల్లోని బోట్స్‌మెన్‌  సొసైటీలు మూతపడ్డాయి. కోటిలింగాల రేవులో మాత్రం డ్రెడ్జింగ్‌తో ఇసుక తీస్తున్నారు. మిగతా ర్యాంపులు మాత్రం మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు తెరచుకుంటాయనేది అర్థం కావడంలేదు. ఇటీవల జేపీ కార్పొరేట్‌ సంస్థకు ప్రభుత్వం మొత్తం ఇసుక వ్యాపారాన్ని అప్పగించిన సంగతి తెలిసిందే. టెండరులో టన్ను ఇసుకను రూ.475కు అమ్మాలని ప్రభు త్వం నిర్దేశించింది. కానీ ఇటీవల ఇసుక వ్యాపారం మొదలుపెట్టిన ఈ కంపెనీ ఓపెన్‌ ర్యాంపుల్లో టన్నుకు రూ.475 వసూలు చేస్తూ డిసిల్టేషన్‌ పేరిట బోట్స్‌మెన్‌ సొసైటీల ద్వారా గోదావరి లోపల నుంచి తీసే ఇసుకకు టన్నుకు రూ. 675 వసూలు చేస్తోంది. దీంతో వినియోగదారులు ఈ ర్యాం పులకు రాకుండా ఓపెన్‌ర్యాంపులకే ఎక్కువగా వెళ్లడంతో బోట్స్‌మెన్‌సొసైటీలు తమ ర్యాంపుల్లో ధర తగ్గించాలని కంపెనీపై ఒత్తిడి తెచ్చాయి. అంతేకాకుండా వారం కిందట ఈ బోట్స్‌మెన్‌ సొసైటీ ర్యాంపుల్లో ఇసుక వ్యాపారాన్ని నిలిపివేసింది. ధర తగ్గించే విషయంపై తమ కంపెనీ యాజమాన్యంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. దీంతో ఎంతో కొంత ధర తగ్గిస్తారని సొసైటీ సభ్యులు ఆశించారు. కానీ చిత్రంగా సదరు కంపెనీ ఓ పరిష్కారాన్ని చూపించింది. రేటు తగ్గించేదిలేద ని, బోట్స్‌మెన్‌ ర్యాంపుల్లో టన్ను రూ.675 మాత్రమే అమ్మాలని, కా నీ బిల్లు మాత్రం రూ.475కు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ విధంగా మంగళవారం నుంచి ర్యాంపులన్నీ తెరచి విక్రయాలు కొనసాగించాలని స్పష్టం చేసింది. దీనితో బోట్స్‌మెన్‌సొసైటీ సభ్యులు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. టన్నుకు రూ.675 తీసుకుని రూ.475కు బిల్లు ఇస్తే వినియోగదారులు ఊరుకోరని, గొడవలు జరుగుతాయని బదులిచ్చారు. కానీ మీ ఇష్టమైతేనే చేయండని, అంతకంటే ధర తగ్గించేదిలేదని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేసినట్టు సమాచారం. ఇప్పుడు వేమగిరి ర్యాం పులో టన్ను రూ.475. కానీ ధవళేశ్వరంలోని గాయత్రి ర్యాంపు, రాజమ
హేంద్రవరం పరిఽధిలోని కాతేరు, వెంకటనగరం ర్యాంపులో రూ.675కు విక్ర యిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు తమ ర్యాంపులకు రావడానికి మొగ్గుచూపరనే ఆందోళన సొసైటీ సభ్యుల్లో నెలకొంది. మంగళవారం ర్యాంపులు తెరవడం, తక్కువ బిల్లులకు అమ్మకాలు చేయడం ప్రా రంభించారు. కానీ వినియోగదారుల నుంచి వ్యతిరేకతతోపాటు ఈ విష యం వివాదంగా మారడంతో సొసైటీ ర్యాంపులను వెంటనే మూసేశారు.

Updated Date - 2021-06-23T06:56:16+05:30 IST