హైదరాబాద్: పోడు భూముల సమస్యపై కేసీఆర్ హామీ ఏమైంది? అని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి ప్రశ్నించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న మహిళలపై పోలీసుల దాడులు సమంజసం కాదన్నారు. డిపార్ట్మెంట్కు చెప్పేదొకటి.. ఆయనిచ్చే స్టేట్మెంట్ మరొకటని మండిపడ్డారు. గిరిజన మహిళలపై దాడులు చేసి సమస్య పెండింగ్ పెడుతున్నారని చెప్పారు. తెలంగాణ రైతులకు చేసిందేమీ లేదు కానీ.. పొరుగు రాష్ట్రాల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఇవి కూడా చదవండి