Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈటల నిజాయితీ పరుడని ప్రజలు నమ్మారు: రేణుక చౌదరి

ఖమ్మం: హుజురాబాద్‌లో టీఆర్ఎస్ తుక్కుతుక్కుగా ఓడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈటల రాజేందర్ నిజాయితీ పరుడని ప్రజలు నమ్మారని, అందుకే గెలిపించారన్నారు. ఈ పోటీ ఈటెల, సీఎం కేసీఆర్ మధ్య వ్యక్తిగతంగా జరిగిందన్నారు. కేసీఆర్‌కు ఎవరూ దొరక్క, కాంగ్రెస్‌ను తిడుతున్నారని మండిపడ్డారు. ఈటెల దొరికారని బీజేపీ గెంతులేస్తే ఏమీకాదన్నారు. ఈటెల గెలుపుతో బీజేపీకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం కాంగ్రెస్‌లో సాధారణమేనని, అన్ని సమీక్షించుకుని సరిచేసుకుంటామని రేణుక చౌదరి వ్యాఖ్యానించారు.


Advertisement
Advertisement