వీసాల రెన్యూవ‌ల్‌పై యూఏఈ కీల‌క ప్ర‌క‌ట‌న‌

ABN , First Publish Date - 2020-07-12T16:29:32+05:30 IST

వీసాల రెన్యూవ‌ల్‌పై యూఏఈ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో గ‌డువు ముగిసిన వీసాల‌ను త‌క్ష‌ణ‌మే రెన్యూవ‌ల్ చేసుకోవాల‌ని యూఏఈ ఆదేశించింది.

వీసాల రెన్యూవ‌ల్‌పై యూఏఈ కీల‌క ప్ర‌క‌ట‌న‌

యూఏఈ: వీసాల రెన్యూవ‌ల్‌పై యూఏఈ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో గ‌డువు ముగిసిన వీసాల‌ను త‌క్ష‌ణ‌మే రెన్యూవ‌ల్ చేసుకోవాల‌ని యూఏఈ ఆదేశించింది. దీనికి సంబంధించి ఫెడ‌ర‌ల్ అథారిటీ ఫ‌ర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఐసీఏ) ద‌ర‌ఖాస్తుల‌ను జూలై 12 నుంచి స్వీక‌రిస్తున్న‌ట్లు తెలిపింది. అలాగే మే నెల‌లో గ‌డువు ముగిసిన రెసిడెన్సీ ధృవ‌ పత్రాలను ఆగ‌స్టు 8 నుంచి... జూన్, జూలైలో గ‌డువు ముగిసే రెసిడెన్సీ వీసాల‌ను సెప్టెంబ‌ర్ 10 నుంచి ప్రాసెస్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ‌‌కాగా, క‌రోనా నేప‌థ్యంలో ఐసీఏ కేంద్రాల్లో రద్దీ ఏర్ప‌డ‌కుండా ఉండేందుకు విడ‌త‌ల వారిగా రెన్యూవ‌ల్ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇక ఇటీవ‌ల యూఏఈ వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవ‌ల్‌కు సంబంధించి మూడు నెల‌ల గ్రేస్ పీరియ‌డ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.   

Updated Date - 2020-07-12T16:29:32+05:30 IST