ఫ్లెక్సీ తొలగించడం హేయమైన చర్య

ABN , First Publish Date - 2022-07-07T06:14:06+05:30 IST

పెద్దపంజాణి పట్టణంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఫ్లెక్సీ తొలగింపుపై పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అమరనాథ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్దపంజాణీలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దాన్ని స్థానిక పోలీసులు పంచాయతీ అధికారుల సాయంతో తొలగించారు.

ఫ్లెక్సీ తొలగించడం హేయమైన చర్య
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి

పెద్దపంజాణి, జూలై 6: పట్టణంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి  ఫ్లెక్సీ తొలగింపుపై పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అమరనాథ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్దపంజాణీలో  టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దాన్ని స్థానిక పోలీసులు పంచాయతీ అధికారుల  సాయంతో తొలగించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దపంజాణీకి చేరుకుని నిరసన వ్యక్తం జేశారు.  నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో మదనపల్లెలో జరుగుతున్న మినీమహానాడుకు   వెళ్తున్న అమరనాథరెడ్డి,  పులివర్తినాని, కోదండయాదవ్‌, దొరబాబు వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్బంగా  అమరనాథరెడ్డి మాట్లాడుతూ అధికారపార్టీ  ఫ్లెక్సీలను మాత్రం అలాగే ఉంచి ప్రతిపక్ష పార్టీలవి తొలగించడం సరికాదన్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో విషరాజకీయాలకు బీజం వేస్తున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా మాత్రమే రాజకీయాలు చేసే రోజులు పోయి నిత్యం రాజకీయాలు చేసే రోజులు వచ్చాయన్నారు.  మాజీ ఎంపీపీ మురళీమోహన్‌, పార్టీ మండల అధ్యక్షుడు ఆనందకుమార్‌,  పగడాల ప్రవీణకుమార్‌, గణేష్‌, వేణుగోపాల్‌నాయుడు, ముబారక్‌తాజ్‌, చలపతి, గంగప్ప, బాలాజి, రుద్రమూర్తి, దనుంజయ, నారాయణ, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T06:14:06+05:30 IST