Removing Condom: భాగస్వామి అనుమతి లేకుండా ఆ సమయంలో కండోమ్ తొలగించడం నేరం.. కెనడా కోర్టు తీర్పు!

ABN , First Publish Date - 2022-07-31T21:05:25+05:30 IST

భాగస్వామి అనుమతి లేకుండా శృంగార సమయంలో కండోమ్ తొలగించడం నేరం అని కెనడా సుప్రీం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

Removing Condom: భాగస్వామి అనుమతి లేకుండా ఆ సమయంలో కండోమ్ తొలగించడం నేరం.. కెనడా కోర్టు తీర్పు!

భాగస్వామి అనుమతి లేకుండా శృంగార సమయంలో కండోమ్ తొలగించడం నేరం అని కెనడా సుప్రీం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఒక కేసులో తీర్పునిస్తూ కెనడా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2017లో ఆన్‌లైన్‌ ద్వారా పరిచయమైన ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నారు. కలిసిన తర్వాత లైంగికంగా ఒకరికి ఒకరు అనుకూలంగా ఉన్నారో లేదో తనిఖీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 


ఇది కూడా చదవండి..

American Woman pregnancy: వరుసగా 16 ఏళ్లు గర్భంతోనే ఉంది.. 12మంది పిల్లలకు తల్లి అయింది.. అయినా ఇంకా..


లైంగిక చర్య సమయంలో కండోమ్ ఉపయోగించాలని ఆ మహిళ పట్టుబట్టింది. దీంతో ఆ వ్యక్తి సరేనన్నాడు. అయితే ఆ మహిళకు తెలియకుండా కండోమ్ తొలగించి శృంగారంలో పాల్గొన్నాడు. తర్వాత విషయం తెలుసుకున్న మహిళ హెచ్‌ఐవీ రాకుండా ముందు జాగ్రత్తగా చికిత్స చేయించుకుంది. అనంతరం ఆ వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసు వేసింది. ఆ కేసును ట్రయల్ కోర్టు కొట్టేసింది. దీంతో ఆ మహిళ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 


ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.. భాగస్వామికి తెలియకుండా శృంగార సమయంలో కండోమ్ తొలగించడం అత్యాచార నేరంతో సమానమని పేర్కొంది. `కండోమ్ ఉపయోగించి లైంగిక చర్యలో పాల్గొనడం అనేది కండోమ్ లేకుండా చేసే లైంగిక సంపర్కంతో పోల్చుకుంటే భిన్నమైనది. అయితే కండోమ్ లేకుండా శృంగారం చేసే విషయంలో భాగస్వాములిద్దరూ ముందుగా ఒప్పందం చేసుకోవాల`ని పేర్కొంది. 

Updated Date - 2022-07-31T21:05:25+05:30 IST