లైంగిక హింసను ప్రోత్సహించే ఆ ప్రకటనను తొలగించండి

ABN , First Publish Date - 2022-06-05T08:15:12+05:30 IST

మహిళలను కించపరుస్తూ.. లైంగిక హింసను ప్రోత్సహించే ఓ బాడీస్ర్పే యాడ్‌ను తొలగించాలంటూ యూట్యూబ్‌, ట్విటర్‌లకు కేంద్ర సమాచార ప్రసారశాఖ శనివారం లేఖ రాసింది.

లైంగిక హింసను ప్రోత్సహించే ఆ ప్రకటనను తొలగించండి

లేయర్‌ షాట్‌ బాడీస్ర్పే యాడ్‌పై యూట్యూబ్‌, ట్విటర్‌కు కేంద్రం

న్యూఢిల్లీ, జూన్‌ 4: మహిళలను కించపరుస్తూ.. లైంగిక హింసను ప్రోత్సహించే ఓ బాడీస్ర్పే యాడ్‌ను తొలగించాలంటూ యూట్యూబ్‌, ట్విటర్‌లకు కేంద్ర సమాచార ప్రసారశాఖ శనివారం లేఖ రాసింది. లేయర్‌ కంపెనీ తయారీ అయిన ‘షాట్‌’ అనే బాడీస్ర్పే యాడ్‌ గ్యాంగ్‌రే్‌పలను, పురుషాహంకారాన్ని ప్రోత్సహించేలా.. మహిళలను కించపరిచేలా ఉందని నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఆరోపించారు. దీన్ని భారత ప్రకటనల ప్రమాణాల మండలి విశ్లేషించి, ఉల్లంఘనలున్నట్లు గుర్తించింది. ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పరన్‌ స్వాతి మాలివాల్‌ కూడా దీనిపై పోలీసులు, సమాచార ప్రసార శాఖకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-06-05T08:15:12+05:30 IST