సచివాలయం కోసం ఎన్టీఆర్‌ విగ్రహం తొలగింపు

ABN , First Publish Date - 2020-07-11T08:30:46+05:30 IST

గ్రామ సచివాలయ భవనం నిర్మాణం కోసం ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తొలగించడంతో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం నగరం గ్రామంలో ఉద్రిక్తత చోటు

సచివాలయం కోసం ఎన్టీఆర్‌ విగ్రహం తొలగింపు

  • జగ్గంపేట మండలం నగరంలో ఉద్రిక్తత

జగ్గంపేట/జగ్గంపేటరూరల్‌, జూలై 10: గ్రామ సచివాలయ భవనం నిర్మాణం కోసం ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తొలగించడంతో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం నగరం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ తీర్మానంతో ఏర్పాటుచేసిన విగ్రహా న్ని గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం తొలగించారు. నిర్మాణంలో ఉన్న ఓ కమ్యూనిటీ భవనంలో ఆ విగ్రహాన్ని పడేశారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. గ్రామంలో ఖాళీగా 27 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని అక్కడ కార్యాలయాలు నిర్మించుకోవచ్చని, అలా కాకుండా తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తొలగించి కార్యాలయాలు నిర్మించాలను కోవడం సరికాదన్నారు. వెంటనే ఆయన జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. విగ్రహం తొలగింపుపై పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. అయితే.. సీఐ వి.సురేష్‌బాబు, ఎంపీడీవో వెంకటలక్ష్మి భవన నిర్మాణాలు పూర్తయిన వెంటనే ఆ పక్కనే  విగ్రహ ఏర్పాటుకు హామీ ఇవ్వడంతో అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది.

Updated Date - 2020-07-11T08:30:46+05:30 IST