కోరుట్లలో అక్రమ నిర్మాణాల తొలగింపు

ABN , First Publish Date - 2022-05-27T06:10:32+05:30 IST

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వివిధ వార్డులలో అక్రమంగా నిబంధనలు పాటించకుండా చేపట్టిన నిర్మాణాలను మున్సిపల్‌ అధికారులు కూల్చి వేశారు.

కోరుట్లలో అక్రమ నిర్మాణాల తొలగింపు
అక్రమ కట్టడాలను తొలగిస్తున్న అధికారులు

కోరుట్ల, మే 26 : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వివిధ వార్డులలో అక్రమంగా నిబంధనలు పాటించకుండా చేపట్టిన నిర్మాణాలను మున్సిపల్‌ అధికారులు కూల్చి వేశారు.  గురువారం కోరుట్ల రెవ్వెన్యూ డివిజన్‌ అధికారి వినోద్‌కుమార్‌, అసిస్టెంల్‌ సిటి ప్లానర్‌ శ్రీనివాస్‌ రావు ఆధ్వర్యంలో నిర్మాణాలు తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ అసిస్టెంల్‌ సిటీ ప్లానర్‌ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ టీఎస్‌ - బి పాస్‌కు అనుగుణంగా అనుమతి పొందిన విధంగా నిర్మాణం చేసుకోవాల న్నారు. అక్రమంగా నిర్మాణం చేసిన కట్టడాలను నోటీసులు ఇవ్వకుండా తొల గించడానికి వెనుకాడమని అన్నారు. భవన నిర్మాణం చేసుకునే యజమానులు ప్రభుత్వ నిబంధనలు పూర్తిస్థాయిలో పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవ్వెన్యూ, పోలీసు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T06:10:32+05:30 IST