వేములపల్లిలో గోశాల తొలగింపు

ABN , First Publish Date - 2020-10-02T09:14:45+05:30 IST

మండపేట మండలం ద్వారపూడి పంచాయతీ పరిధిలోగల వేములపల్లిలో పంచాయతీకి చెందిన లక్షలు ..

వేములపల్లిలో గోశాల తొలగింపు

 మండపేట, అక్టోబరు 1 : మండపేట మండలం ద్వారపూడి పంచాయతీ పరిధిలోగల వేములపల్లిలో పంచాయతీకి చెందిన లక్షలు విలువైన స్థలంలో గోశాల ముసుగులో స్థలం కబ్జాచేసేందుకు ప్రబుద్ధుడు వేసిన ఎత్తుగడలను అధికారులు చిత్తుచేసి గోశాలను తొలగించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 2017లో గోశాల పేరిట పంచాయతీకి చెందిన విలువైన స్థలంలో గోశాల నిర్మించేందుకు ప్రయత్నించాడు. అప్పటిలో పంచాయతీ గోశాలకోసం అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్‌కు తీర్మానం పంపించారు. ఆ తీర్మానం ఇప్పటివరకు అనుమతికి నోచుకోలేదు.


ఈలోపుగా రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో మరోసారి తెరపైకి గోశాల వ్యవహారంను తీసుకువచ్చి స్థానిక అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు సమక్షంలో  ఈ యేడాది  సెప్టెంబరులో గోశాలఏర్పాటు చేసి  అట్టహసంగా ప్రారంభించాడు. ఆ గోశాల నిర్మాణం చట్టవిరుద్దమని తక్షణమే తొలగించాలని మండల ఎంపీడీవో గౌతమి, ఈవోపీఆర్డీ రాజులు గోశాల నిర్వాహకుడికి ఆదేశాలు జారీ చేశారు. అయినా తొలగించకపోవడంతో అధికారులే గోశాలను తొలగించారు. ఇళ్లమధ్యలో గోశాల నిర్మించటంపై ప్రజల నుంచి సర్వత్రా నిరసన వ్యక్తమైంది. చివరికి వేములపల్లిలో గోశాల ముసుగులో భూకబ్జాకు వేసిన పథకం బెడిసికొట్టింది. దీంతో విలువైన స్థలాన్ని అధికారులు కాపాడారు. 

Updated Date - 2020-10-02T09:14:45+05:30 IST