యువకుడికి రిమాండ్
హైదరాబాద్/హయత్‌నగర్: ఆడుకుంటున్న చిన్నారిని గదిలోని తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఓ చిన్నారి (2) బుధవారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా సమీపంలో నివాసం ఉండే గుల్షన్ సహానీ(25) పాపకు చాక్లెట్ ఇస్తానని చెప్పి గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పాప కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి గుల్షన్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.