ABN ఆంధ్రజ్యోతి చేతిలో డ్రగ్స్ నిందితుల రిమాండ్ రిపోర్ట్

ABN , First Publish Date - 2022-04-06T20:55:49+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన డ్రగ్ కేసులో కీలక విషయాలు

ABN ఆంధ్రజ్యోతి చేతిలో డ్రగ్స్ నిందితుల రిమాండ్ రిపోర్ట్

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన రాడిసిన్ హోటల్ పబ్ డ్రగ్ కేసులో కీలక విషయాలు ఏబీఎన్ చేతికి చిక్కాయి. డ్రగ్స్ నిందితుల రిమాండ్ రిపోర్ట్ ABN ఆంధ్రజ్యోతి చేతికి లభిచింది. శనివారం రాత్రి 1:40కి పబ్‌లో కొకైన్‌పై పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే ఉన్నతాధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అలాగే క్లూస్‌ టీమ్‌కు  కూడా  పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈజీ మనీ కోసమే డ్రగ్స్‌‌ను నిర్వాహకులు సరఫరా చేస్తున్నట్లు  రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. 1985 ఎన్డీపీఎస్‌ యాక్ట్ యు/ఎస్‌ 42(2) కింద కేసు నమోదు చేశారు. పబ్‌ మీద రాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులు దాడి చేశారు. పబ్‌లో తెల్లవారుజామున 4 గంటల వరకు కొకైన్‌ సరఫరా జరిగింది.


ఈ దాడిలో ల్యాప్‌టాప్‌, మినీ ప్రింటర్‌, వెయింగ్‌ మిషన్‌, ప్యాకింగ్‌ మెటీరియల్‌ను తమ వెంట పోలీసులు తీసుకెళ్లారు. పబ్‌లోకి వచ్చాక మేనేజర్‌ అనిల్‌కు పోలీసులు సమాచారమిచ్చారు. మేనేజర్‌ అనిల్ కుమార్ దగ్గర ప్లాస్టిక్ ట్రేలో ఉన్న కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5 ప్యాకెట్లలో 4.64 గ్రాములు తెల్ల పౌడర్ స్వాధీనం చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అనిల్‌ పార్ట్‌నర్‌ అభిషేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  



Updated Date - 2022-04-06T20:55:49+05:30 IST