ప్రయాణాలకు విముఖత

ABN , First Publish Date - 2020-09-07T14:19:10+05:30 IST

కొవిడ్‌ మూలంగా దేశీయ ట్రావెల్‌ పరిశ్రమపై పెద్ద దెబ్బనే పడింది. విమానయానం సహా ఇత ర రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ

ప్రయాణాలకు విముఖత

  • పండగల సీజన్‌లోనూ వెళ్లేందుకు నిరాసక్తత
  • కొవిడ్‌ విస్తృతితో అప్రమత్తం: తాజా సర్వే

ముంబై: కొవిడ్‌ మూలంగా దేశీయ ట్రావెల్‌ పరిశ్రమపై పెద్ద దెబ్బనే పడింది. విమానయానం సహా ఇత ర రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ప్రజలు మాత్రం అప్రమత్తంగానే ఉంటున్నారు. అయితే వచ్చే పండగల సీజన్‌పై ప్రయాణ పరిశ్రమ కొంత ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ ఆశలు అడియాశలయ్యే అవకాశం ఉందని తాజా సర్వే ద్వారా వెల్లడైంది. వచ్చే అక్టోబరు-నవంబరులో ప్రయాణాల కోసం 20 శాతానికన్నా తక్కువ మంది ప్రణాళికలు చేసుకున్నట్టు తేలింది. ప్రతి సంవత్సరం ఈ రెండు నెలల్లోనే పెద్ద పండగలైన దసరా, దుర్గా పూజ, దీపావళి వస్తుంటాయి. ఈ సందర్భంగా అనేక మంది వివిధ ప్రాంతాలకు వెళ్లి పండగలు జరుపుకుంటారు. అయితే ఈసారి మాత్రం తమ ప్రయాణ తేదీ దగ్గరపడే వరకు బుకింగ్‌లు చేసుకోవాలనుకోవడం లేదని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది పేర్కొన్నా రు. దేశవ్యాప్తంగా 239 జిల్లాల్లోని 25,000కు పైగా మంది సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 19 శాతం మంది ఈ ఏడాదిలో పండగల సందర్భంగా ప్రయాణాలు చేయనున్నట్టు తెలిపారు. కొవిడ్‌ కారణంగా ఈ ఏడాదిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయని  లోకల్‌ సర్కిల్స్‌ పేర్కొంది. అన్‌లాక్‌ 4.0లో ఆంక్షలను ఎత్తివేసినా ప్రయాణాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నట్టు తెలిపింది. 

Updated Date - 2020-09-07T14:19:10+05:30 IST