Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలి

రెల్లి కులస్తుల డిమాండ్‌

గుంటూరు. అక్టోబర్‌ 23: జనసేన అధినేత పవన కల్యాణ్‌ నటించిన బీమ్లానాయక్‌ సినిమా టైటిల్‌ సాంగ్‌ను మార్ఫింగ్‌ చేసి రెల్లి జాతిని అవమానపరిచేలా కుట్రకు పాల్పడిన వైసీపీ నాయకులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని రెల్లి కులస్తులు శనివారం గుంటూరు ఈస్ట్‌ డీఎస్పీ సీతారామయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోను శివరాం అనే వైసీపీ నేత పంపించారని, దీనిని వెంటనే డిలీట్‌ చేయడంతో పాటు తమ జాతికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని రెల్లి సంఘం నాయకులు హెచ్చరించారు. ఫిర్యాదు అందజేసిన వారిలో రెల్లి సంఘం నేతలు మాడుగుల ఏడుకొండలు, ముత్యాల వెంకటేష్‌, బొబ్బిలి దుర్గా, కోన విశ్వనాధ్‌, భూపతి నాగార్జున, సోమి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. 


Advertisement
Advertisement