రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ వీడియో సందేశం

ABN , First Publish Date - 2020-04-04T22:49:52+05:30 IST

మర్కజ్‌ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదని, కరోనా కాటుకు కుల, మత బేదాలు లేవని సీఎం జగన్‌ చెప్పారు. కరోనా సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిలో సీఎం ఏపీ ప్రజలకు వీడియో సందేశాన్ని ఇచ్చారు.

రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ వీడియో సందేశం

అమరావతి: మర్కజ్‌ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదని, కరోనా కాటుకు కుల, మత బేదాలు లేవని సీఎం జగన్‌ చెప్పారు. కరోనా సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిలో సీఎం ఏపీ ప్రజలకు వీడియో సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కరోనా కట్టడికి పలు సూచనలు చేశారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని చెప్పారు.


ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనల్ని అతిక్రమించవద్దని ఆయన సూచించారు. సామాజికదూరం పాటిస్తూ కరోనాను తరిమేద్దామని జగన్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం 9 నిమిషాలు లైట్లు ఆపుదామన్నారు. మనమంతా ఒక్కటే అన్న సత్యాన్ని చాటుదామని, వైద్య, పోలీస్‌, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి వేతనాలు అందిస్తామని జగన్‌ ప్రకటించారు. 

Updated Date - 2020-04-04T22:49:52+05:30 IST