రెలి‘గేర్’... మారింది...

ABN , First Publish Date - 2021-06-04T20:32:41+05:30 IST

‘మార్కెట్’లో మరోమారు అనిశ్చిత వాతావరణం నెలకొంది.

రెలి‘గేర్’... మారింది...

హైదరాబాద్ : ‘మార్కెట్’లో మరోమారు అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఆర్‌బీఐ పాలసీ కోసం ఎదురుచూసి, ఆచితూచి వ్యవహరించిన వ్యవహరించిన ట్రేడర్లు... తీరా వడ్డీ రేట్లపై ఎలాంటి మార్పూ లేకపోవడంతో, మరోసారి ప్రాఫిట్ బుకింగ్‌కి దిగినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో... మధ్యాహ్నానికి సెన్సెక్స్ 191 పాయింట్లు నష్టపోయింది నిప్టీ 41 పాయింట్లు నష్టపోయి 15649 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. 


మరోవైపు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ర్యాలీ కొనసాగుతోంది. వాటిలో రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ ఇంట్రాడేలో 9శాతానికిపైగా పెరిగింది.జూన్ 8 న జరిగనున్న బోర్డు సమావేశంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడమే ఈ  ర్యాలికి కారణంగా తెలుస్తోంది. రెలిగేర్‌లో తన వాటా పెంచుకునేందుకు డాబర్ గ్రూప్‌ ఉత్సాహంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థలో డాబుర్ గ్రూపునకు  చెందిన బర్మన్ కుటుంబానికి పది శాతంలోపు వాటాలున్నాయి. ఈ క్రమంలో... ఉదయం పదకొండు గంటలకు  షేరు ధర రూ. 129.70 కు చేరగా, ఆ తర్వాత  అక్కడినుంచి గేర్ మార్చి 15.12 శాతం పెరిగి రూ.137.20కి చేరింది. 

Updated Date - 2021-06-04T20:32:41+05:30 IST