ఆర్థిక ఫలితాలకు ముందే.. ఫుల్ జోష్‌లో రిలయన్స్..

ABN , First Publish Date - 2022-07-22T15:59:33+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) త్రైమాసిక ఫలితాల విడుదలకు ముందే కంపెనీ షేర్లు మంచి జోష్ మీదున్నాయి.

ఆర్థిక ఫలితాలకు ముందే.. ఫుల్ జోష్‌లో రిలయన్స్..

Reliance : రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) త్రైమాసిక ఫలితాల విడుదలకు ముందే కంపెనీ షేర్లు మంచి జోష్ మీదున్నాయి. రిలయన్స్ మరికాసేపట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(Financial Year) ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుంది. ఈ విడుదల చేయడానికి ముందే నేటి ఉదయం కంపెనీ షేర్లు బీఎస్‌ఈ(BSE)లో 1 శాతంపైగా పెరిగి రూ.2,517కి చేరుకున్నాయి. ఉదయం 9:20 గంటలకు ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో 0.5 శాతం లాభంతో పోలిస్తే, షేర్లు 0.99 శాతం పెరిగి రూ. 2,512 వద్ద ఉన్నాయి.


జూలై నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకూ బీఎస్ఈ 30-ప్యాక్ ఇండెక్స్‌లో రిలయన్స్ షేర్లు 4.5 శాతం ర్యాలీ చేయగా.. మార్కెట్‌లో మాత్రం 4 శాతం క్షీణించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ షేర్లు ఫ్రంట్‌లైన్ ఇండెక్స్‌తో ఇన్‌లైన్‌లో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో చమురు నుంచి అదిరిపోయే ఆదాయాలను రాబట్టడంతో ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


బ్లూమ్‌బెర్గ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. కంపెనీ రూ. 2.25 ట్రిలియన్ల నికర అమ్మకాలపై రూ.21,615 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించగలదు. ఇక ఎబిటా ముందు ఆదాయాలు రూ.38,474 కోట్లుగా వచ్చే అవకాశం ఉంది. ఏడాది క్రితంతో పోలిస్తే, టాప్ లైన్ 56 శాతం వృద్ధి చెందుతుందని అంచనాలున్నాయి. బ్లూమ్‌బెర్గ్ ఏకాభిప్రాయ అంచనాల ఆధారంగా ఎబిటా దాదాపు 40 శాతం నుంచి 76 శాతం మధ్య పెరగనున్నాయి.


Updated Date - 2022-07-22T15:59:33+05:30 IST