పుంజుకున్న రిలయన్స్...

ABN , First Publish Date - 2021-11-26T00:43:19+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ చాలా కాలం తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చింది. మొన్న ఆరాంకో డీల్ ఎవాల్యుయేట్ అనే వార్తలు రావడంతో భారీగా పతనమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ రోజు పుంజుకున్నాయి.

పుంజుకున్న రిలయన్స్...

ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ చాలా కాలం తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చింది. మొన్న ఆరాంకో డీల్ ఎవాల్యుయేట్ అనే వార్తలు రావడంతో భారీగా పతనమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ రోజు పుంజుకున్నాయి. ఏకంగా మార్కెట్‌ను ఒంటి చేత్తో నిలబెట్టాయి. దీనికి ప్రధాన కారణంగా నిన్న రాత్రి వచ్చిన గ్యాసిఫికేషన్ అసెట్స్ రీస్ట్రక్చరింగ్ (గ్యాస్ ఆస్తుల పునర్ వ్యవస్థీకరణ). గ్యాసిఫికేషన్ ఆస్తులన్నింటినీ ఒక హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ సంస్థ(ప్రత్యేక సంస్థకు) బదలాయించాలని బోర్డు నిర్ణయం తీసుకుది.


దీని వల్ల ఓలిఫిన్స్‌ను తక్కువ ధరలో, మరింత సమర్థతతో ఉత్పత్తి చేయొచ్చు అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ మాట. ఎనర్జీ ఖర్చులను తగ్గించుకోవడంతో సిన్‌గ్యాస్ ఎంతో మేలు చేస్తుందని, ఇది పూర్తిగా విశ్వాసభరితమైన సరఫరాకు దోహదపడ్తుందని సంస్థ చెబుతోంది. సిన్‌గ్యాస్ అనేది హైడ్రోజన్ తయారీలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రస్తుతం దీన్ని జామ్‌నగర్‌లోని రిఫైనరీలో వినియోగిస్తామని సంస్థ వెల్లడించింది. అక్టోబరులో రూ. 2720 లో వరకూ వెళ్లిన స్టాక్ అక్కడి నుంచి రూ. 2320 వరకూ పడిపోయింది. దాని తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ స్థాయి జంప్ ఈ స్టాక్‌లో చోటుచేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 6.5 శాతం లాభాలతో రూ. 2,500 దగ్గర ముగిసింది. 

Updated Date - 2021-11-26T00:43:19+05:30 IST