ఆర్‌ఐఐఎల్ షేర్లు... నాలుగు రోజుల్లో... నలభై శాతం ర్యాలీ...

ABN , First Publish Date - 2021-12-08T23:36:24+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌ఐఐఎల్) షేర్లు దూసుకెళ్ళాయి. నాలుగు రోజులుగా ఈ షేర్లు దుమ్మురేపుతున్నాయి.

ఆర్‌ఐఐఎల్ షేర్లు... నాలుగు రోజుల్లో... నలభై శాతం ర్యాలీ...

ముంబై : రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌ఐఐఎల్) షేర్లు దూసుకెళ్ళాయి. నాలుగు రోజులుగా ఈ షేర్లు దుమ్మురేపుతున్నాయి. బుధవారం ఇంట్రా-డే ట్రేడ్‌లో రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 19 శాతం పెరిగి రూ. 993.50 కు  చేరుకున్నాయి. రిలయన్స్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంజినీరింగ్ కంపెనీ స్టాక్ నాలుగో ట్రేడింగ్ రోజులో అధిక ధరలను కోట్ చేసింది.  ఈ నాలుగు ట్రేడింగ్ రోజుల్లో... 40 శాతం ర్యాలీ చేసింది. గత రెండు వారాల్లో... నవంబరు 24  న ఆర్‌ఐఐఎల్ మార్కెట్ ధర రూ.  613.85 స్థాయి నుంచి 62 శాతం జూమ్ చేసింది.


అదే సమయంలో ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్ 0.43 శాతం పెరిగింది. ఈ స్టాక్ జూలై 2010 నుంచి అత్యధిక స్థాయిలో ట్రేడవుతోంది. అక్టోబరు 31, 2007 న రికార్డు స్థాయిలో రూ. 3,202 ను టచ్ చేసింది.  మధ్యాహ్నం 02.32 గంటల సమయానికి ఎన్‌ఎస్‌ఈ, బీఎస్ఈల్లో చేతులు మారుతున్న ఆర్‌ఐఐఎల్ మొత్తం ఈక్విటీలో 34 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 5.2 మిలియన్ ఈక్విటీ షేర్లతో కౌంటర్‌లో ట్రేడింగ్ వాల్యూమ్‌లు రెట్టింపయ్యాయి. సెప్టెంబరు 30 నాటికి, ఆర్‌ఐఐఎల్‌లో 45.43 శాతం వాటాను కలిగి ఉంది. వ్యక్తిగత వాటాదారులు 46.41 శాతం హోల్డింగ్ కలిగి ఉండగా, మిగిలిన 8.16 శాతం వాటా కార్పొరేట్(2.76 శాతం), ఐఈపీఎఫ్(1.41 శాతం), హెచ్‌యూఎఫ్(2.36 శాతం), నాన్-రెసిడెంట్ ఇండియన్స్(0.80 శాతం) వద్ద ఉన్నాయి. 

Updated Date - 2021-12-08T23:36:24+05:30 IST