Advertisement
Advertisement
Abn logo
Advertisement

రిలయన్స్‌ రిటైల్‌, నెట్‌ ప్రాఫిట్‌ 74 % జంప్‌...

ముంబై : రెండో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన రిలయన్స్‌ రిటైల్‌... మార్కెట్‌ అంచనాలను అందుకుంది. నికరలాభంలో 74 % వృద్ధితో... రూ. 1,695 కోట్లను ఖాతాలో నిలుపుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికరలాభం రూ. 973 కోట్లు. గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ. 41,100 అమ్మకాల కంటే ఈసారి మరో 10.5 % పెరిగి, రూ. 45,426 కోట్లకు చేరుకుంది. 


ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్‌ విభాగాలు రికార్డు స్థాయిలో రెట్టింపు గ్రోత్‌ కనబరిచి, పాండమిక్‌కు ముందున్న లెవెల్స్‌ను కూడా దాటేశాయి. దీంతో బిగ్‌ రేంజ్‌ రెవెన్యూ వచ్చిపడింది. రెండో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 800 కు పైగా స్టోర్లతో రిలయన్స్ ఔట్‌లెట్ల సంఖ్య 13,500 దాటింది. మొత్తం వైశాల్యం కూడా 37 మిలియన్‌ చదరపు అడుగులను మించిపోయింది. ఈ 13,500 లకు పైగా ఔట్‌లెట్లలో, రెండో త్రైమాసికంలో 90 % పైగా పని చేశాయి. ఈ క్రమంలో...  కార్యకలాపాల్లో వృద్ధి కనిపించింది. అంతకుముందు త్రైమాసికంలో 60 % స్టోర్లే పనిచేశాయి.


జులై-సెప్టెంబరు త్రైమాసికంలో, ఆన్‌లైన్‌ గ్రోసర్‌ 'మిల్క్‌బాస్కెట్‌', హోమ్‌ స్టైలింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ 'పోర్టికో', లోకల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ 'జస్ట్‌డయల్‌'ను రిలయన్స్‌ రిటైల్‌ అక్వైర్‌ చేసింది. 'రితు కుమార్‌'లో కంట్రోలింగ్‌ స్టేక్‌ను కొనుగోలు చేసింది. '7-ఎలెవెన్‌'తో ఫ్రాంచైజీ అగ్రిమెంట్‌ కూడా చేసుకుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరిగింది. పండగ రోజులు తమకు అనుకూలంగా మారాయని కంపెనీ యాజమాన్యం వ్యాఖ్యానించింది.

Advertisement
Advertisement