ముకేశ్ మ్యాజిక్.. జియోలో మరో భారీ పెట్టుబడి!

ABN , First Publish Date - 2020-06-06T16:13:13+05:30 IST

జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడులు ఆకర్షించడంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. గత ఆరు వారాల్లో.. ఫేస్‌బుక్ వంటి ప్రముఖ సంస్థల నుంచి జియోలోకి ఆరు సార్లు నిధుల ప్రవాహాన్ని తీసుకొచ్చిన ఆయన తాజాగా ఏడోసారీ తన మ్యాజిక్ ప్రదర్శించారు.

ముకేశ్ మ్యాజిక్.. జియోలో మరో భారీ పెట్టుబడి!

ముంబై: జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడులు ఆకర్షించడంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. గత ఆరు వారాల్లో.. ఫేస్‌బుక్ వంటి ప్రముఖ సంస్థల నుంచి జియోలోకి ఆరు సార్లు నిధుల ప్రవాహాన్ని తీసుకొచ్చిన ఆయన తాజాగా ఏడోసారీ తన మ్యాజిక్ ప్రదర్శించారు.


జియోలో ఇది వరకే పెట్టుబడి పెట్టిన సిల్వర్ లేక్‌ నుంచి మరో 4 వేల కోట్ల నిధులను రాబట్టారు.  దాదాపు 4500 కోట్ల రూపాయలను జియోలోకి మళ్లించేందుకు సిల్వర్ లేక్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. మే 4 తొలిసారిగా సిల్వర్ లేక్..రూ.5655.75 కోట్లను పెట్టుబడి పెట్టి ఒక శాతం వాటా కొనుగోలు చేసింది. దీంతో జీయోలో సిల్వర్ లేక్ వాటా మొత్తం 2.08 శాతానికి చేరుతుందని సమాచారం. గత ఆరు వారాల్లో రిలయన్స్..జియోలోని 19.9 శాతం వాటాను విక్రయించి 92,202.15 కోట్ల రూపాయలను సమీకరించింది. ఫేస్‌బుక్, ముబదల, విస్టా ఈక్విటీ, కేకేఆర్ అండ్ కో, జనరల్ అంట్లాంటిక్ వంటి దిగ్గజ సంస్థలు ఈ వాటాలను కొనుగోలు చేశాయి.  


సీల్వర్ లేక్ చరిత్ర ఇదీ..

2013లో కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్‌లో వాటాలు కొనుగోలు చేయడం ద్వారా సిల్వర్ లేక్ మార్కెట్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. టెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు ఈ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ప్రసిద్ధి. తాజా లెక్కల ప్రకారం సిల్వర్ లేక్‌కు దాదాపు 43 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. జియోనే కాకుండా.. ట్విటర్, ఎయిర్ బీఎస్‌బీ, ఏఎన్‌టీ ఫైనాన్షియాల్స్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫబెట్‌కు చెందిన వెయిమో, వెరిలీ వంటి సంస్థల్లో సిల్వర్ లేక్‌కు వాటాలున్నాయి. 

Updated Date - 2020-06-06T16:13:13+05:30 IST