‘ఫార్చూన్‌ 500’లో ఎల్‌ఐసీ

ABN , First Publish Date - 2022-08-04T08:11:12+05:30 IST

క్యాపిటల్‌ మార్కెట్‌లో నమోదైన కొద్ది కాలానికే ప్రభు త్వ రంగంలోని ఎల్‌ఐసీ ‘ఫార్చూన్‌ గ్లోబల్‌-500’ కంపెనీల జాబితాలో చోటు...

‘ఫార్చూన్‌ 500’లో ఎల్‌ఐసీ

 జాబితాలో రిలయన్స్‌, ఐఓసీ, ఎస్‌బీఐ


న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్‌లో నమోదైన కొద్ది కాలానికే ప్రభు త్వ రంగంలోని ఎల్‌ఐసీ ‘ఫార్చూన్‌ గ్లోబల్‌-500’ కంపెనీల జాబితాలో చోటు సంపాదించింది. ఫార్చూన్‌ పత్రిక తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో ఎల్‌ఐసీకి 98వ స్థానం దక్కింది. 2021-22 ఆర్థిక సంవత్సరం కంపెనీల ఆదాయం, లాభాల ఆధారంగా ఫార్చూన్‌ పత్రిక ఈ జాబితా రూపొందించింది. ఈ జాబితాలో మొత్తం తొమ్మిది భారత కంపెనీలకు చోటు దక్కింది. ఇందులో ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు, నాలుగు ప్రైవేట్‌ రంగ కంపెనీలు. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 9,726 కోట్ల ఆదాయం, 55.38 కోట్ల డాలర్ల నికర లాభంతో మిగతా భారత కంపెనీల కంటే ఎల్‌ఐసీ ఈ జాబితాలో ముందుంది.


రిలయన్స్‌ మరింత ముందుకు: వరుసగా 19వ సంవత్సరంలో కూడా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫార్చూన్‌ గ్లోబల్‌-500 జాబితాలో చోటు సంపాదించింది. మొత్తం 500 కంపెనీల జాబితాలో రిలయన్స్‌కు 104వ స్థానం దక్కింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 9,398 కోట్ల డాలర్ల ఆదాయం, 815 కోట్ల డాలర్ల నికర లాభంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, 51 స్థానాలు ముందుకొచ్చింది.


Updated Date - 2022-08-04T08:11:12+05:30 IST