కొనసాగుతోన్న రిలయన్స్ పెట్టుబడులు.. ఇప్పుడు ‘రోబో’లపై...

ABN , First Publish Date - 2022-01-20T01:42:20+05:30 IST

రియన్స్ అధినేత ముఖేష్ అంబానీ... మరో కొత్త రంగంలో పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఈ దఫా ఆయన... రోబోలపై దృష్టి సారించారు.

కొనసాగుతోన్న రిలయన్స్ పెట్టుబడులు.. ఇప్పుడు ‘రోబో’లపై...

ముంబై : రియన్స్ అధినేత ముఖేష్ అంబానీ... మరో కొత్త రంగంలో పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఈ దఫా ఆయన... ‘రోబో’లపై దృష్టి సారించారు. ఈ క్రమంలో... రోబోటిక్స్ స్టార్టప్ యాడ్‌వర్బ్‌ టెక్నాలజీస్‌లో కీలక వాటా కొనుగోలు చేయనున్న కంపెనీలో కీలక వాటా కోసం 80-120 మిలియన్‌ డాలర్ల వరకు వెచ్చించనున్నారు. రిలయన్స్‌పరిశ్రమలు, వేర్‌హౌసింగ్‌లో కౌంటింగ్ అండ్ టాలీ రోబోటిక్స్‌ను తయారు చేస్తోన్న యాడ్‌వర్బ్‌ టెక్నాలజీస్‌ప్రస్తుతం... రోబోలను కోకో కోలా, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తదితర కంపెనీలు వినియోగిస్తున్నాయి. కాగా... రోబోలను  ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు తాజా పెట్టుబడి దోహదపడుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  


కాగా... ఆగ్నేయాసియా, అమెరికా, యూరప్‌ దేశాలు సహా పెద్ద మార్కెట్లకు వ్యాపారాన్ని విస్తరించేందుకు రిలయన్స్‌ కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక... ఏటా 50 వేల రోబోలను తయారు చేయగల సామర్థ్యంతో యాడ్‌వర్బ్‌ టెక్నాలజీస్‌కు నోయిడాలో ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో... నిధుల సమీకరణ తర్వాత మరో యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2022-01-20T01:42:20+05:30 IST