వ్యాక్సిన్‌ వేసుకుంటే 5 శాతం డిస్కౌంట్‌

ABN , First Publish Date - 2021-05-05T06:50:28+05:30 IST

తమ కస్టమర్లు వ్యాక్సిన్‌ వేయించుకోవడాన్ని ప్రోత్సహించేందుకు రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వ్యాక్సిన్‌ వేయించుకున్న ఖాతాదారులకు 5 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది...

వ్యాక్సిన్‌ వేసుకుంటే 5 శాతం డిస్కౌంట్‌

  • రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రోత్సాహకం

న్యూఢిల్లీ : తమ కస్టమర్లు వ్యాక్సిన్‌ వేయించుకోవడాన్ని ప్రోత్సహించేందుకు రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వ్యాక్సిన్‌ వేయించుకున్న ఖాతాదారులకు 5 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. కొత్తగా జీవిత బీమా పాలసీలు తీసుకున్న వారితో పాటు ప్రీమియం చెల్లింపులకు కూడా ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. ఇది ఒక్క విడత  ప్రీమియమ్‌కు మాత్రమే పరిమితమని కంపెనీ తెలిపింది. రిలయన్స్‌ హెల్త్‌ ఇన్ఫినిటీ పాలసీపై ప్రస్తుతం ఇస్తున్న డిస్కౌంట్లకు అదనంగా ఇది ఒక్క విడతకు మాత్రమే వర్తింపచేస్తున్నట్టు పేర్కొంది. తొలి షాట్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా ఈ డిస్కౌంట్‌ పొందవచ్చు. 


Updated Date - 2021-05-05T06:50:28+05:30 IST