హైదరాబాద్ : రిలయన్స్ డిజిటల్ పండగల సీజన్ కోసం ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ సేల్ ప్రకటించింది. నవంబరు 10 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ ఆఫర్ కింద అన్ని రకాల ఎలకా్ట్రనిక్ వస్తువుల కొనుగోలు మీద ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల చెల్లింపులపై 10 నుంచి 15 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. దీనికి తోడు ఐడీఎ్‌ఫసీ ఫస్ట్ బ్యాంక్ నుంచి కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలూ అందుకోవచ్చు. ఆన్‌లైన్‌లో రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్ ద్వారా కొనేవారికి ఈజీ ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్లకు తోడుగా పండగ బహుమతిగా కొనుగోలుదారులకు రూ.1,000 వరకు విలువైన ఏజియో, రిలయన్స్ ట్రెండ్స్ ఓచర్లు అందుకోవచ్చు. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్20 స్మార్ట్ ఫోన్‌ను 32 శాతం డిస్కౌంట్‌తో రూ.47,999కి అందిస్తోంది. యాపిల్ ఐఫోన్ 12, వన్ ప్లస్, ఒప్పో, వినో ఫోన్ల మీద, ఆసుస్ ధిన్ అండ్ లైట్ లాప్‌టాప్స్‌పై ప్రత్యేక ఆఫర్లు అందుకోవచ్చు.