ఆపిల్ తర్వాత... రిలయెన్సే

ABN , First Publish Date - 2020-08-06T23:03:02+05:30 IST

అతిపెద్ద బ్రాండ్ల విషయంలో... ప్రపంచంలోనే రెండో స్థానం దక్కించుకుంది ముకేశ్‍ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‍ లిమిటెడ్‍. అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‍ తర్వాతి స్థానం.... రిలయన్స్‌దేనని ప్యూచర్‍ బ్రాండ్‍ ఇండెక్స్ 2020 జాబితాలో వెల్లడైంది.

ఆపిల్ తర్వాత... రిలయెన్సే

ముంబై : అతిపెద్ద బ్రాండ్ల విషయంలో... ప్రపంచంలోనే రెండో స్థానం దక్కించుకుంది ముకేశ్‍ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‍ లిమిటెడ్‍. అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‍ తర్వాతి స్థానం....  రిలయన్స్‌దేనని ప్యూచర్‍ బ్రాండ్‍ ఇండెక్స్ 2020 జాబితాలో వెల్లడైంది.


ఇక... మూడవ స్థానంలో సామ్‍సంగ్, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎన్విడియా, మౌటాయ్‍, నైక్‍, మైక్రోసాఫ్ట్, ఏఎస్‍ఎంఎల్‍, పేపల్‍, నెట్‍ఫ్లిక్స్ సంస్థలున్నాయి.


రిలయన్స్ ఇండస్ట్రీస్‍ వృద్ధిపథంలో దూసుకుపోతోందని, కష్టమర్లకు మెరుగైన సేవలను అందిస్తూ, కొత్త ఆలోచనలతో పరుగులు పెడుతోందని ప్యూచర్‍ బ్రాండ్‍ ఈ సందర్భంగా పేర్కొంది.


గడచిన ఆరేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని, సంస్థల ప్రాధాన్యాలు కూడా మారాయని ఈ నివేదిక వెల్లడించింది. 

Updated Date - 2020-08-06T23:03:02+05:30 IST