కనికరించని రుతుపవనాలు!

ABN , First Publish Date - 2022-07-03T04:46:52+05:30 IST

కనికరించని రుతుపవనాలు!

కనికరించని రుతుపవనాలు!

- జూన్‌లో వర్షాలు ఎగనామం....

- 21 మండలాల్లో లోటు వర్షపాతం

- తొమ్మిది మండలాల్లో మాత్రమే ఆశాజనకం 

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

రుతు పవనాలు కనికరించలేదు. జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఫలితంగా వర్షాకాలంలోనూ జిల్లాకు లోటు వర్షపాతం వెంటాడుతోంది. జిల్లాలో 30 మండలాలకుగానూ తొమ్మిది మండలాల్లో మాత్రమే ఆశాజనకంగా వర్షం కురిసింది. 21 మండలాల్లో లోటు నుంచి అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌ 1వ తేదీ నుంచి జూలై 2 వరకు గణాంకాల ప్రకారం 147.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంది. కాగా, 122.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ప్రస్తుతం -16.9 శాతం లోటు వర్షపాతం కొనసాగుతోంది. ప్రధానంగా కంచిలి మండలంలో ఏకంగా 80.4 శాతం లోటు వర్షపాతం వెంటాడుతోంది. దీని తర్వాత స్థానంలో కవిటి, ఇచ్ఛాపురం, కొత్తూరు, పోలాకి, లావేరు, గార మండలాలు ఉన్నాయి. అలాగే వజ్రపుకొత్తూరు, ఎల్‌.ఎన్‌.పేట, హిరమండలం, టెక్కలి, బూర్జ, సరుబుజ్జిలి, ఆమదాలవలస, పలాస, ఎచ్చెర్ల మండలాల్లో మాత్రమే కురవాల్సినదాని కంటే అదనంగా వర్షాలు కురవడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. కాగా ఖరీఫ్‌ సాగులో నిమగ్నమైన రైతులు ఈ నెలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే లోటు వర్షపాతం భర్తీ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. లేదంటే సాగు కష్టమేనని.. లోటు వర్షపాతం ప్రభావం తాగునీటి వనరులపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.  


జూన్‌ 1 నుంచి జూలై 2వరకు వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో) : 

-----------------------------------------------------------------------

మండలం కురవాల్సినది కురిసినది తేడా(శాతం)

-----------------------------------------------------------------------

కొత్తూరు 165.5 96.2 -41.9 

పాతపట్నం 153.3 137.1 -10.6 

మెళియాపుట్టి 170.1 113.4 -33.3 

మందస 141.1 133.7 -5.2 

కంచిలి 152.0 29.8 -80.4 

ఇచ్ఛాపురం 172.4 77.9 -54.8 

కవిటి 185.0 58.4 -68.4

సోంపేట 144.7 91.9 -36.5 

నందిగాం 141.9 132.7 -6.5 

సారవకోట 175.2 174.6 -0.3 

సంతబొమ్మాళి 133.9 130.5 -2.5 

కోటబొమ్మాళి 135.2 65.9 -51.3 

జలుమూరు 141.9 115.8 -18.4 

జి.సిగడాం 131.4 41.5 -68.4 

నరసన్నపేట 167.9 101.6 -39.5 

పోలాకి 159.3 82.5 -48.2 

గార 142.0 89.2 -37.2 

శ్రీకాకుళం 127.1 108.9 -14.3 

పొందూరు 136.7 123.8 -9.4 

లావేరు 119.8 62.5 -47.8 

రణస్థలం 131.0 130.6 -0.3 


ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదైన మండలాలివే... 

ఎచ్చెర్ల 132.0 192.6 +45.9 

పలాస 146.5 160.5 +9.6 

ఆమదాలవలస 140.3 196.6 +40.1 

సరుబుజ్జిలి 138.1 204.1 +47.8 

బూర్జ 140.3 168.9 +20.4 

టెక్కలి 170.0 198.9 +17.0 

హిరమండలం 184.1 185.4 +0.7

ఎల్‌.ఎన్‌.పేట 138.1 146.0 +5.7

వజ్రపుకొత్తూరు 147.5 222.9 +51.1 

Updated Date - 2022-07-03T04:46:52+05:30 IST