ఉదయం విడుదల.. సాయంత్రం నిలిపివేత!

ABN , First Publish Date - 2021-06-22T05:30:00+05:30 IST

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు నుంచి కాక తీయ కాలువ ద్వారా లోయర్‌ మానేరు డ్యాంకు ఉదయం 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి సాయంత్రం నిలి పివేసినట్టు ప్రాజెక్టు డీఈ నరేష్‌ తెలిపారు.

ఉదయం విడుదల.. సాయంత్రం నిలిపివేత!
శ్రీరామసాగర్‌ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం

కాకతీయ కాలువకు నీటి విడుదల నిలిపివేత
ఎస్సారెస్పీలోకి స్వల్ప ఇన్‌ఫ్లో

మెండోర, జూన్‌ 22: శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు నుంచి కాక తీయ కాలువ ద్వారా లోయర్‌ మానేరు డ్యాంకు ఉదయం 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి సాయంత్రం నిలి పివేసినట్టు ప్రాజెక్టు డీఈ నరేష్‌ తెలిపారు. శ్రీరామ సాగర్‌ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,747క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ఆయన తెలిపారు. ప్రాజెక్టు ఎగువ గల విష్ణు పురి ప్రాజెక్టు 90శాతం నిండిందని, ఆ ప్రాజెక్టు గేట్లను ఎ ప్పుడైనా ఎత్తే అవకాశం ఉందని డీఈ పేర్కొన్నారు. ప్రస్తు తం శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆవిరి రూపంలో 406 క్యూసెక్కులు, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 50 క్యూసెక్కులు, మిష న్‌ భగీరథకు 152క్యూసెక్కులు ఔట్‌ప్లో పోతోందని డీఈ తె లిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (90 టీఎంసీలు) కాగా.. మంగళవారం సాయంత్రానికి 1,0 67.80 అడుగుల (24.954 టీఎంసీలు) నీరు నిల్వ ఉంద న్నారు. గత సంవత్సరం ఇదే రోజున 1,070.40 అడుగుల (29.722 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని, జూన్‌ 1వ తేదీ నుంచి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 7.803 టీఎం సీల వరద వచ్చి చేరిందని డీఈ తెలిపారు.

Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST