హంద్రీనీవా ద్వారా నీరు విడుదల చేయండి

ABN , First Publish Date - 2021-01-23T06:49:43+05:30 IST

సోమందేపల్లి చెరువు ఆయకట్టు కింద సాగుచేసిన వరిపంటలకు హంద్రీనీవా కాలువ ద్వారా నీరు విడుదల చేయాలని శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు

హంద్రీనీవా ద్వారా నీరు విడుదల చేయండి
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన రైతులు

 

 తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా  

సోమందేపల్లి(పెనుకొండ), జనవరి 22 : సోమందేపల్లి చెరువు ఆయకట్టు కింద సాగుచేసిన వరిపంటలకు హంద్రీనీవా కాలువ ద్వారా నీరు విడుదల చేయాలని శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న ఆధ్వర్యంలో  రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇరిగేషన్‌ అధికారులు హంద్రీనీవా కాలువ ద్వారా పంటసాగుకు నీరు విడుదలు చేస్తామని హామీ ఇచ్చి నీరు విడుదల చేయలేదన్నారు. ఆయకట్టు కింద దాదాపు 250 ఎకరాల్లో వరిపంట సాగుచేశామని నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం తహసీల్దార్‌ సురేష్‌, ఎస్‌ఐ వెంకటరమణ రైతులతో కలిసి ఇరిగేషన్‌ అధికారులతో చర్చించారు. త్వరలో నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. 

Updated Date - 2021-01-23T06:49:43+05:30 IST