సింగరేణి మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఈఅండ్‌ఎం) ఫలితాల విడుదల

ABN , First Publish Date - 2020-09-20T06:46:32+05:30 IST

సింగరేణి యాజమాన్యం మార్చి 1న నిర్వహించిన మేనేజ్‌మెం ట్‌ ట్రైనీ (ఈఅండ్‌ఎం) పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేసింది...

సింగరేణి మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఈఅండ్‌ఎం) ఫలితాల విడుదల

కొత్తగూడెం, సెప్టెంబరు 19: సింగరేణి యాజమాన్యం మార్చి 1న నిర్వహించిన మేనేజ్‌మెం ట్‌ ట్రైనీ (ఈఅండ్‌ఎం) పరీక్ష  ఫలితాలను శనివారం విడుదల చేసింది. పరీక్ష సమయంలో కొన్ని మాల్‌ ప్రాక్టీస్‌ కేసులను పోలీసులు పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌లో కేసులు రిజిస్టర్‌ చేశారు. ఎస్పీ ఈ కేసును ఏఎస్‌పీ శబరీష్‌కు అటాచ్‌చేసి దర్యాప్తు చేయించారు. ఏఎస్‌పీ శబరీష్‌ సంబంధిత పోలీస్‌ అధికారుల ద్వారా క్షుణ్ణంగా విచారణ జరిపించి దోషులుగా గుర్తించబడిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. సంబంధిత పరీక్ష ఫలితాలను నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలను తీసుకొని విడుదల చేయాల్సిందిగా సూచించారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వారు ఇచ్చిన సమాచారం ప్రకారంగా సింగరేణి యాజమాన్యం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను సింగరేణి అధికారిక వెబ్‌ సైట్‌లో ఉంచడంతో పాటు హెడ్డాఫీస్‌లోగల నోటీస్‌ బోర్డులో కూడా ఉంచడం జరుగుతుందని జీఎం (పర్సనల్‌ ఆర్‌సీ - ఐఆర్‌ అండ్‌ పీఎం) ఎ.ఆనందరావు ఒక ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2020-09-20T06:46:32+05:30 IST