డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల

ABN , First Publish Date - 2021-09-16T03:48:41+05:30 IST

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్ల కోసం షెడ్యూల్‌ను

డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల

అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్ల కోసం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేసారు. ఈనెల 16న నోటిఫికేషన్ వెలువడనుంది. 17 నుంచి 22 వరకు విద్యార్థుల నమోదు ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈనెల 23 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లలకు అవకాశం ఇచ్చారు. ఈనెల 29న కాలేజీల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. ఈనెల 30 నుంచి అక్టోబర్ 1 మధ్య కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి క్లాస్‌లు ప్రారంభం అవుతాయి. 

Updated Date - 2021-09-16T03:48:41+05:30 IST