హైదరాబాద్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 810 ఒప్పంద అధ్యాపకులకు ఆగస్టు, సెప్టెంబరు జీతాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ.39.86 కోట్లు విడుదల చేస్తూ కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీచేశారు.