బాసర అభివృద్ధికి రూ.7.68 కోట్ల విడుదల

ABN , First Publish Date - 2021-01-19T06:44:46+05:30 IST

నిర్మల్‌ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ది కోసం ప్రభుత్వం రూ. 7.68 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ జిఓ నంబర్‌ 38ని సోమవారం విడుదల చేసింది.

బాసర అభివృద్ధికి రూ.7.68 కోట్ల విడుదల

- సీఎం కేసీఆర్‌ హామీ మేరకు రూ. 50కోట్లలో మొదటివిడత చెల్లింపు 

- జీఓ విడుదల చేసిన ప్రభుత్వం 

బాసర, జనవరి 18 : నిర్మల్‌ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ది కోసం ప్రభుత్వం రూ. 7.68 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ జిఓ నంబర్‌ 38ని సోమవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 సంవత్సరంలో ఆదిలాబాద్‌ సభలో బాసర అభివృద్దికి రూ. 50 కోట్లను కేటాయిస్తున్నట్లు హమీ ఇచ్చారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కింద ఈ నిధులను అందజేస్తోంది. ఈ నిధులతో మాస్టర్‌ ప్లాన్‌లోని పలు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆలయం వద్ద ఉన్న అతిథి గృహాల పై భాగంలో భక్తుల విడిది కోసం గదులను నిర్మిస్తున్నారు. వీటితో పాటు అర్చీ గేటు, ఇతర అభివృద్ది పనులు చేపట్టనున్నారు. అందులో ముఖ్యంగా అమ్మవారి ప్రధాన ఆలయ విస్తరణ పనులు చేపట్టే అవకాశం ఉంది. ప్రధాన ఆలయం ఇరుకుగా ఉండడంతో భక్తులు సులుభంగా అమ్మవారిని దర్శించుకోలేకపోతున్నారు. క్యూలైన్‌లో వేచి చూసే సమయం రెట్టింపవుతోంది. ఈ నిధులతో ఆలయ విస్తరణ పనులు చేపట్టాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు

Updated Date - 2021-01-19T06:44:46+05:30 IST